AP DGP: మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

 మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

Updated : 12 Aug 2021 13:52 IST

అమరావతి: మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ఏవోబీ సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ సహా ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన ప్రకటించారు. గత రెండేళ్లుగా గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గిరిజనులకు 3లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని.. సుమారు 20వేల మందికి పట్టాలు ఇచ్చిందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని