AP high court: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా

ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది.

Updated : 02 Sep 2021 14:37 IST

అమరావతి: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినా  చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. ఐఏఎస్‌ అధికారుల జీతాల నుంచి కట్‌ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌కు జైలు, రూ.1000 జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్‌ శేషగిరిబాబుకు రూ.1000 జరిమానా, 2 వారాల జైలు శిక్ష, ఎస్‌.ఎస్‌.రావత్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానాతో పాటు మరొక ఐఏఎస్‌కు శిక్ష విధించింది. శిక్షపై అప్పీల్‌ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్‌ చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని