AP News: 3 నెలల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు: ఏపీపీఎస్సీ కార్యదర్శి

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యంకనంపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వివరణ ఇచ్చారు.

Updated : 04 Oct 2021 13:15 IST

అమరావతి: ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యంకనంపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వివరణ ఇచ్చారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గానే మూల్యంకనం చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు డిజిటల్‌ మూల్యంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదని తెలిపారు. ముందే నోటిఫికేషన్‌లో చెప్పనందుకు తప్పుబట్టిందన్నారు. డిజిటల్‌ వాల్యువేషన్‌ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని సూచనలు వచ్చినా తాము ఒప్పకోలేదని వివరించారు. 3 నెలల్లో మూల్యంకనాలు పూర్తి చేసి ఫలితాలిస్తామని ఆంజనేయులు స్పష్టం చేశారు. 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు వారంలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు