Vemulawada: వేములవాడలో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్‌ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో

Updated : 07 Sep 2021 15:34 IST

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్‌ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. మూలవాగుపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రింగ్‌ పనులు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన సెంట్రింగ్‌ కుప్పకూలింది. వేములవాడ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రాకపోకలకు వేర్వేరుగా ఇన్‌, అవుట్‌ రహదారులు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఐదేళ్ల క్రితం రూ.28 కోట్లతో వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. నిర్మాణ దశలోనే వంతెన కూలిపోవడంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని