Viveka Murder Case: మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదు: చైతన్యరెడ్డి  

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని

Updated : 18 Nov 2021 09:21 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతించడంతో ట్రాన్సిట్‌ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని ఈ ఉదయం 10గంటలకు కడపకు తీసుకురానున్నారు. మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో సీబీఐ ఆయనను హాజరుపరచనుంది.

మరోవైపు న్యాయం చేయాలని కోరుతూ సీబీఐకి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖ రాశారు. ‘‘వివేకా హత్య కేసులో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆరోపణలతోనే మా నాన్నను అరెస్టు చేశారు. ఈ నెల 15న ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నందున న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి’’ అని చైతన్యరెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని