CM KCR: భావజాల వ్యాప్తికోసం జయశంకర్‌ తన జీవితాన్నే త్యాగం చేశారు: కేసీఆర్‌

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ అని సీఎం కేసీఆర్‌ అన్నారు

Updated : 06 Aug 2021 12:16 IST

హైదరాబాద్‌: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు ఆయనని కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు.

‘‘తెలంగాణ ప్రజల హృదయాల్లో జయశంకర్‌ సదా నిలిచి ఉంటారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అన్న ఆయన ఆశయాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. రాష్ట్రాన్ని సాధించిన ఏడేళ్ల అనతికాలంలోనే సాగునీరు, వ్యవసాయం వంటి రంగాలను తీర్చిదిద్దాం. అదే క్రమంలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మిషన్‌ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు.. రైతు బంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలెత్తుకుని తిరిగేలా.. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని