యువరాజ్‌సింగ్‌ ఉదారత.. నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో 120 ఐసీయూ పడకలు

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని యూవీకెన్ ఫౌండేషన్‌ (YouWeCan Foundation) ద్వారా నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 120 ఐసీయూ పడకలు..

Updated : 28 Jul 2021 16:37 IST

హైదరాబాద్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని యూవీకెన్ ఫౌండేషన్‌ (YouWeCan Foundation) ద్వారా నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 120 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఐసీయూ పడకలను వర్చువల్‌ విధానం ద్వారా యువరాజ్‌ సింగ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు ఆస్పత్రిలో యూవీకెన్ వార్డులను జిల్లా కలెక్టర్‌ ఆదినారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘యూవీకెన్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా రూ.2.5 కోట్లతో ఐసీయూ పడకలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కొవిడ్‌పై పోరుకు యూవీకెన్‌ ఫౌండేషన్‌ తరఫున సహకారం అందిస్తున్నాం. వైద్య కళాశాలల్లో వెయ్యి పడకల ఏర్పాటు యూవీకెన్‌ లక్ష్యం. ఇందులో భాగంగా మొదట నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ పడకలు ఏర్పాటు చేశాం’’ అని యువరాజ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ యువరాజ్‌ సేవలను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని