Diwali Celebrations: తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రెండు రాష్ట్రాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు భక్తి శ్రద్ధలతో ..

Published : 05 Nov 2021 01:37 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రెండు రాష్ట్రాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు నిర్వహించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చుతూ సందడి చేశారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా గడిపారు. బాణసంచా శబ్దాలతో ఊరువాడా దద్దరిల్లిపోయాయి. దీపకాంతుల వెలుగుల్లో పట్టణాలు, గ్రామాలు కళకళలాడుతున్నాయి. విద్యుత్‌ దీపాల అలంకరణలో అనేక ప్రాంతాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. దుకాణాలు, సముదాయాలు, ప్రైవేట్‌ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ పర్యటనలో తాను బస చేసిన పోర్టు గెస్ట్‌ హౌస్‌లో దీపావళి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్వెల వెలుగులు అందరి జీవితాల్లో అను నిత్యం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్థిల్లాలని ప్రార్థించారు.

దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని