South Central railway: ఎక్స్‌ప్రెస్ టు సూపర్ ఫాస్ట్‌.. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు: ద.మ.రైల్వే

దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పరిధిలోని రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మార్పు

Published : 30 Sep 2021 01:21 IST

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పరిధిలోని రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ద.మ.రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా, ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్పు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ద.మ.రైల్వే పరిధిలో 872 రైళ్లుండగా.. వాటిలో 673 రైళ్ల వేగాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రైళ్ల టెర్మినల్‌ స్టేషన్లలో మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ద.మ. రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్‌ 1 నుంచి ప్రయాణాలు చేసే వారంతా ముందస్తుగా రైళ్ల సమయ వేళలు తెలుసుకొని ప్రయాణాలు చేయాలని ద.మ.రైల్వే సూచించింది.

ఎక్స్‌ప్రెస్ టు సూపర్ ఫాస్ట్‌గా మారిన రైళ్లు..

ప్యాసింజర్‌ టు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారినవి..

దారి మళ్లించినవి..

టెర్మినల్‌ స్టేషన్లలో మార్పులు చేసిన రైళ్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని