Exercise: దృఢత్వం అంటే తీవ్రమైన వ్యాయామం కాదు
దృఢత్వం (ఫిట్నెస్) అంటే సిక్స్‌ప్యాక్ ఉండేలా తీవ్రమైన వ్యాయామం చేయడం, ఆలివ్ నూనె వాడడం కాదని బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.దేవిశెట్టి అన్నారు. చక్కని సౌష్టవంతో కనిపించేందుకు మరీ ఎక్కువసేపు
నారాయణ హృదయాలయ వైద్యుడు డా.దేవిశెట్టి
దృఢత్వం (ఫిట్నెస్) అంటే సిక్స్‌ప్యాక్ ఉండేలా తీవ్రమైన వ్యాయామం చేయడం, ఆలివ్ నూనె వాడడం కాదని బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.దేవిశెట్టి అన్నారు. చక్కని సౌష్టవంతో కనిపించేందుకు మరీ ఎక్కువసేపు వ్యాయామశాలల్లో గడపడం, ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది కాదని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన శనివారం బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గత కొద్ది సంవత్సరాలలో నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న తొమ్మిది మందిని ఇలాగే కోల్పోయాను. ఫిట్‌గా కనిపించాలని ఎక్కువ వ్యాయామం చేసి 40 ఏళ్ల వయసులోనే వారు మరణించారు. కనీసం 20 నిమిషాలు మోస్తరు వ్యాయామం చేయాలి. కీటో, మోటోడైట్లు కాదు...మీ ప్రాంతంలో లభించే కాలానుగుణమైన పండ్లు, ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం, కనీసం ఏడు గంటలు నిద్రపోవడం, ఉత్ప్రేరకాలను వాడకపోవడం, మద్యం, పొగ, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమం. నడక కన్నా ఉత్తమ వ్యాయామం మరొకటి లేదు. సప్లిమెంట్ పేరిట ఆహారం, పానీయాల్లో కలుపుకొని తాగే పొడులను విడిచిపెట్టండి. ధ్యానం చేయండి. మీ శరీర అవసరాలను అర్థం చేసుకోండి. నాలుగు పదుల వయసులో శరీరం పలు మార్పులకు గురవుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మరింత జాగ్రత్త వహించండి. ఒత్తిడిని దూరం చేసుకోండి. బయట ఆరోగ్యంగా కనిపించినట్లు.. శరీరం లోపలా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని లేఖలో డా.దేవిశెట్టి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్‌లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM