Governor Tamilisai: సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉందని తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ

Updated : 08 Sep 2021 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉందని తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో ఆమె విడుదల చేశారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. రాజ్‌భవన్‌ సిబ్బంది సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. గవర్నర్‌గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ మీడియా ఎంతగానో సహకరించిందని.. అందుకే ప్రజలకు మరింత చేరువ కాగలిగామన్నారు. గవర్నర్‌గా రెండేళ్ల విజయాన్ని ఇటీవల మృతిచెందిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు తమిళిసై తెలిపారు.  
 
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోందని గవర్నర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆమె అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని తమిళిసై తెలిపారు. మొదట్లో ఆయుష్మాన్‌ భారత్‌కు సీఎం ఆసక్తి చూపలేదని.. ఆ కార్యక్రమం గురించి వివరించడంతో సమ్మతించారని గుర్తుచేసుకున్నారు. అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమవంతు సహాయంగా రోగులకు కిట్లను అందించారన్నారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్‌క్రాస్‌, ఇండియన్‌ ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని