AP News: కొప్పర్రులో రాళ్ల దాడి ఘటన.. పోలీసుల అదుపులో 15 మంది

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన ఘర్షలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి 15 మందిని

Updated : 21 Sep 2021 11:50 IST

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన ఘర్షలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పొన్నూరు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిన్న రాత్రి వినాయకుడి విగ్రహం నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ పార్టీకి చెందిన వారు జెండాలు ఊపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలిపారు. గొడవలో మూడు ద్విచక్రవాహనాలు దహనమైనట్లు చెప్పారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని