నోరూరించే భేల్‌పూరీ తినాలని ఉందా..అయితే ఇక్కడి వెళ్లండి..!

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా నెటిజన్లను మెప్పించే సందేశాలు పోస్టు చేస్తుంటారు. ఈ వారాంతంలో స్ట్రీట్ ఫుడ్‌ గురించి చెప్పి, నోరూరించారు. ఈ భేల్‌పూరీ తినాలంటే కోల్‌కతా వెళ్లినప్పుడు ప్రయత్నించండని ట్వీట్ చేశారు.

Published : 31 Oct 2021 01:31 IST

ఇది హర్షగోయెంగా సూచన

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా నెటిజన్లను మెప్పించే సందేశాలు పోస్టు చేస్తుంటారు. ఈ వారాంతంలో స్ట్రీట్ ఫుడ్‌ గురించి చెప్పి, నోరూరించారు. ఈ భేల్‌పూరీ తినాలంటే కోల్‌కతా వెళ్లినప్పుడు ప్రయత్నించండని ట్వీట్ చేశారు.

‘భేల్‌పూరీ టోస్ట్ నాకిష్టమైన స్ట్రీట్ ఫుడ్. అన్నింటిలోకెల్లా  కోల్‌కతాలో తయారు చేసే ఆ చిరుతిండి రుచి అమోఘం. బ్రెడ్‌ ముక్కపై బంగాళదుంప, ఉల్లి, కొబ్బరి ముక్కలు, వేరుశెనగ, చింతపండు చట్నీ, చిల్లీ చట్నీ, భుజియా వేసుకొని తింటే దాని రుచే వేరు. మీరు కోల్‌కతా వెళ్తే తప్పక ప్రయత్నించండి’ అంటూ భేల్‌పూరీ విక్రయిస్తోన్న ఓ చిన్న స్టాల్‌ ఫొటోలను షేర్ చేశారు. 

దీని గురించి చెప్పగానే ఆహార ప్రియులకు వెంటనే నోరూరిపోయింది. కొందరు మేం ప్రయత్నిస్తాం అనగా.. మరికొందరు కోల్‌కతాలో ఆ ప్రాంతం ఎక్కడో చెప్పండంటూ హర్షను కోరారు. ఈ ట్వీట్‌పై పేటీఏం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ కూడా స్పందించారు. ‘కొత్త రుచులు. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను!’ అంటూ వ్యాఖ్యను జోడించారు. మరికొందరు ఇది ఏయే ప్రాంతాల్లో దొరుకుందో కూడా చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని