Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. నదులను తలపిస్తున్న కాలనీలు..

రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

Updated : 08 Nov 2021 13:49 IST

చెన్నై: రాజధాని చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజూ చెన్నై నగరంలో కుండపోత వర్షం కురవడంతో చాలా చోట్ల రహదారులు జగదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నైలో ప్రధాన రోడ్లు, కాలనీలు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్‌ సిబ్బంది మోటార్లతో నీటిని తోడుతున్నారు. తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, మధురైలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.  

తమిళనాడులో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చెన్నై సహా చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని