Hyderabad police: నా పతకం పోలీస్‌ సేవలకు అంకితం: పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని పోలీస్ శాఖ అందిస్తున్న సేవలకు అంకితం ఇస్తున్నట్లు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. కొవిడ్ సమయంలో పోలీసులు

Updated : 10 Aug 2021 17:48 IST

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని పోలీస్ శాఖ అందిస్తున్న సేవలకు అంకితం ఇస్తున్నట్లు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. కొవిడ్ సమయంలో పోలీసులు ఎంతో ఉన్నతమైన సేవలు అందించారని సింధు కొనియాడారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్బంగా ‘ది సెకండ్ వేవ్’ పుస్తకాన్ని సింధు ఆవిష్కరించారు. రెండో విడత లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన విధులకు సంబంధించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అనంతరం హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ క్రీడపై సింధు తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు, ఏసీపీలు పాల్గొని సింధును అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని