PV Sindhu: 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా: పీవీ సింధు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, వైజాగ్‌ స్టీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ పి.వి.సింధు విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహించిన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు

Updated : 30 Aug 2021 18:43 IST

విశాఖ: భారత స్టార్‌ షట్లర్‌, వైజాగ్‌ స్టీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధు విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండోర్‌ స్టేడియంలోని చిన్నారుల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి విమల విద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు ఆమె పతకాలు అందజేశారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో సింధు మాట్లాడారు. తనపై ప్రజలు చూపిస్తున్న అదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

‘‘విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ నెలకొల్పాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. తప్పకుండా అకాడమీ నెలకొల్పడానికే ప్రయత్నిస్తాను. ఎంతో మంది క్రీడాకారులను తీర్చదిద్దేందుకు నావంతు కృషి చేస్తాను. గతంలోనూ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు చాలా మంది క్రీడాకారులు వివిధ ఆటల్లో రాణించడం చూశాను. ఇలాగే వారందరు కష్టపడుతూ.. రానున్న రోజుల్లో దేశానికి పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయతలు నాపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ ఆదరాభిమానాలతో భవిష్యత్తులోనూ రాణిస్తాను’ అని సింధు తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని