Supreme Court: ఏపీ మంత్రి సురేశ్‌పై సీబీఐ కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు..

Updated : 22 Sep 2021 13:53 IST

దిల్లీ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. కాగా, ఈ ఉత్తర్వులను సుప్రీంలో సీబీఐ సవాలు చేసింది. ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వివరించింది. ఛార్జిషీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంను కోరింది. దీనిపై సురేశ్‌ దంపతులు స్పందిస్తూ కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు