Lower Manair Dam: కరీంనగర్ ఎల్‌ఎండీ గేట్లు ఎత్తివేత

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయం గేట్లను అధికారులు సోమవారం సాయంత్రం ఎత్తారు.

Published : 30 Aug 2021 21:11 IST

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయం గేట్లను అధికారులు సోమవారం సాయంత్రం ఎత్తారు. కొన్ని రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎండీకి ఇన్ ఫ్లో బాగా పెరిగింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ అధికారులు 8 గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో ఇంకా పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. ఎల్ఎండీ జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.171 టీఎంసీల నీరున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఎండీకి ప్రస్తుతం మోయ తుమ్మెద వాగు నుంచి 60వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని