Ap News: హోం వర్క్‌ చేయలేదని విద్యార్థులను చితకబాదిన లెక్చరర్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు మ్యాక్స్‌ హోంవర్క్‌ చేయలేదని కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌ విద్యార్థులను చితకబాదిన

Published : 28 Nov 2021 01:33 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు మ్యాథ్స్‌ హోంవర్క్‌ చేయలేదని కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌ విద్యార్థులను చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులను కొట్టిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీలో లెక్చరర్లు విద్యార్థుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పీవీసీ పైపులు, అట్టలతో కూడా విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో స్పందించిన యాజమాన్యం.. లెక్చరర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. యాజమాన్యం హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం బాధిత విద్యార్థి కుటుంబ సభ్యలు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థిని కొట్టిన లెక్చరర్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడి శాంతిపంజేశారు. లెక్చరర్‌ వచ్చి క్షమాపణ చెప్పడంతో వారు శాంతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని