Landmine: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పేలిన మందుపాతర

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు విధ్వంస కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

Updated : 06 Sep 2021 14:31 IST

చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం లెనిన్‌ కాలనీ సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోని మామిడి తోట వద్ద చెట్టుకు మావోయిస్టులు గోడపత్రం అంటించారు. ఇది చూసేందుకు పాతచర్లకు చెందిన బ్రహ్మనాయుడు బైక్‌పై వెళ్లారు. గోడపత్రం చదువుతుండగా అక్కడే అమర్చిన ప్రెషర్‌ బాంబుపై ఆయన కాలువేయడంతో అది పేలింది. ఈ ఘటనలో బ్రహ్మంనాయుడు తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిని స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన చర్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌, ఎస్సై రాజువర్మ నేతృత్వంలోని పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని