Ts News: తెలంగాణలో మద్యం దుకాణాలు పెంపు.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం

Updated : 08 Nov 2021 18:56 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు రేపటి నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివర తేదీ కాగా.. 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి కానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇప్పుడున్న 2,216 మద్యం దుకాణాలకు ఇవి అదనమని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు అవుతాయని వివరించింది. దీంతో ఇప్పుడున్న 2,216 దుకాణాలకు పెరిగిన 404 దుకాణాలతో కలిపి ఆ సంఖ్య 2,620కి పెరిగింది.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు మద్యం దుకాణాల కేటాయింపుల ప్రక్రియను అబ్కారీ శాఖ పూర్తి చేసింది. కమిటీ సభ్యులతోపాటు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించినట్లు తెలిపింది. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని