ఎయిరిండియా టేకోవర్‌: రతన్‌జీకి అందిన బహుమతి ఏంటో తెలుసా..?

విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకోవడంపై వ్యాపార వర్గాలు అమితాసక్తిని ప్రదర్శించాయి. అందుకు తగ్గట్టే దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఆ సంస్థ సొంత యజమానుల చెంతకు చేరుకుంది. దీనిపై ఇప్పటికే టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘వెల్‌కమ్ బ్యాక్‌’ అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే తాజాగా టాటా నెట్టింట్లో షేర్ చేసిన చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. 

Published : 14 Oct 2021 02:33 IST

ముంబయి: విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకోవడంపై వ్యాపార వర్గాలు అమితాసక్తిని ప్రదర్శించాయి. అందుకు తగ్గట్టే దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఆ సంస్థ సొంత యజమానుల చెంతకు చేరుకుంది. దీనిపై ఇప్పటికే టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘వెల్‌కమ్ బ్యాక్‌’ అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే తాజాగా టాటా నెట్టింట్లో షేర్ చేసిన చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. 

ఈ టేకోవర్ గౌరవార్థం సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్ విమానం ఆకారంలో ఉన్న ఒక బిస్కట్‌ను రతన్‌ టాటాకు పంపింది. ఎయిరిండియా విమానం రంగులనే దానికి అద్దింది. అది టాటా మనసును మెప్పించింది. వెంటనే ఆ విషయాన్ని ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. ఈ అందమైన బహుమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఇదిలా ఉండగా.. ముంబయిలోని లాభాపేక్ష లేని బేకరీనే ఈ రతన్‌ టాటా ఇనిస్టిట్యూట్. దీన్ని 1928లో లేడీ నవాజ్‌బాయ్ టాటా స్థాపించారు. పార్సీ రుచుల్ని పరిచయం చేయడం ద్వారా మహిళలకు లాభదాయకమైన ఉపాధిని అందించడమే ఈ సంస్థ లక్ష్యం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని