AP News: ధర్మవరం కూరగాయల మార్కెట్లో దుకాణాల తొలగింపు.. ఉద్రిక్తత

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 24 Oct 2021 12:35 IST

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుజామునే మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ యంత్రాలతో మార్కెట్‌లోని దుకాణాలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రాంతంలో కొత్తగా మార్కెట్ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ఉన్న దుకాణాలను తొలగించే ప్రయత్నం చేస్తుండటంతో కొద్దిరోజులుగా వ్యాపారులు అడ్డుకుంటున్నారు. నూతన మార్కెట్‌ సముదాయం కోసం పురపాలక సంస్థ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా రూ.10లక్షలు డిపాజిట్‌ చేయాలని వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు.

డిపాజిట్లు చెల్లించని నేపథ్యంలో అధికారులు ఇవాళ 40కి పైగా దుకాణాలను తొలగించారు. రెండు దుకాణాలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో వాటిని మినహాయించారు. తాము అంతమొత్తంలో డబ్బులు చెల్లించలేమని వ్యాపారులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా తెదేపా నాయకులు కూడా నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకు దిగిన వ్యాపారులు, తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దుకాణాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని