
Updated : 10 Aug 2021 14:16 IST
RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కరోనా
హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకడంతో ఆయన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నందున సలహాలు తీసుకొని ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 8న నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్, బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Tags :