Saidabad: మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి: సైదాబాద్‌ బాలిక తండ్రి

తమకు ప్రభుత్వం తరఫున అందజేసిన సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌

Updated : 16 Sep 2021 10:32 IST

హైదరాబాద్‌: తమకు ప్రభుత్వం తరఫున అందజేసిన సాయాన్ని వెనక్కిచ్చేస్తామని సైదాబాద్‌ బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఈ ఉదయం పరామర్శించిన మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ వారికి రూ.20 లక్షల చెక్కు అందజేశారు. కాగా, మంత్రులు చేసిన సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ.20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని లేల్చి చెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

‘‘మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు. మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి. చెక్కుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదు’’ అని బాలిక తండ్రి చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని