Updated : 07/09/2021 01:11 IST

Sedition Case: మాజీ గవర్నర్‌ అజీజ్‌ ఖురేషీపై రాజద్రోహం కేసు!

యోగీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలపై కేసు నమోదు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌ అజీజ్‌ ఖురేషీపై రాజద్రోహం కేసు నమోదయ్యింది. ఖురేషీ వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ భాజపా నేత ఆకాశ్‌ కుమార్‌ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంపూర్‌ జిల్లాలోని సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ గవర్నర్‌పై కేసు నమోదు అయ్యింది.

సమాజ్‌వాదీ పార్టీ నేత, ఎంపీ అజంఖాన్‌ను పరామర్శించేందుకు మాజీ గవర్నర్‌ అజీజ్‌ ఖురేషీ ఈమధ్యే రాంపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా యూపీ ప్రభుత్వాన్ని రక్తాన్ని పీల్చే భూతంతో పోల్చిన ఆయన.. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఖురేషీ చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించడంతో పాటు సమాజంలో అశాంతికి  కారణమవుతున్నాయని ఆరోపిస్తూ భాజపా నేత ఆకాశ్‌ కుమార్‌ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖురేషీ వ్యాఖ్యలకు సంబంధించి వివిధ వార్తా ఛానల్స్‌లో వచ్చిన వీడియోలను పోలీసులకు అందించారు. దీంతో 153A, 153B, 124A, 505(1)(B) సెక్షన్‌ల కింద అజీజ్‌ ఖురేషీపై కేసు నమోదు చేసినట్లు సివిల్‌ లైన్స్‌ పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా అజీజ్‌ ఖురేషీ (81) 2015-2015 మధ్య కాలంలో మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌కు ఇంఛార్జీ గవర్నర్‌గా, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా అజీజ్‌ ఖురేషీ సేవలందించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని