KRMB: ఏపీ నిరాధారమైన వాదన పట్టించుకోవద్దు.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు

Published : 21 Sep 2021 19:23 IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. ‘‘తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వం కోరింది. గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని ఏపీ కోరింది. కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లిస్తున్నాం. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోంది. ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి కూడా రాదు. మిగులు నీటిని ఎగువ  ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చు. తక్కువ నీటి మళ్లింపునకు టెలిమెట్రీలు అవసరం లేదు’’ అని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని