Ts News: ధాన్యం సేకరణపై తేలని పంచాయితీ...  దిల్లీలోనే  కేసీఆర్‌, మంత్రులు

కేంద్ర మంత్రులతో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. ధాన్యం సేకరణ విషయం తేలకుండానే సమావేశం ముగిసింది. రెండు రోజుల తర్వాత మరోసారి భేటీ కావాలని మంత్రుల బృందం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి

Updated : 24 Nov 2021 17:28 IST

దిల్లీ: కేంద్ర మంత్రులతో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. ధాన్యం సేకరణ విషయం తేలకుండానే సమావేశం ముగిసింది. రెండు రోజుల తర్వాత మరోసారి భేటీ కావాలని మంత్రుల బృందం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు సీజన్లలో ధాన్యం సేకరించాలని రాష్ట్ర బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కనీసం 100 నుంచి 200 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. వారి విజ్ఞప్తి మేరకు ఏ సీజన్‌లో ఎంత ధాన్యం ఉంటుంది.. ఉత్పత్తిపై స్పష్టంగా చెప్పాలని ప్రతినిధుల బృందాన్ని గోయల్‌ కోరారు. నిర్దిష్ట అంచనాలతో వస్తే నిర్ణయానికి రావొచ్చని గోయల్‌ అన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి గోయల్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి తోమర్‌ను బృందం కలిసింది. మంత్రుల బృందాన్ని తోమర్ వద్దకు గోయల్‌ స్వయంగా తీసుకెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని.. కొన్నింటిపై ఎలాంటి స్పందన రాలేదని రాష్ట్ర మంత్రులు  పేర్కొన్నారు. ఈ నెల 26న మరోసారి భేటీ అవుదామని.. అన్ని విషయాలపై చర్చించి నిర్ణయిద్దామని గోయల్‌ చెప్పినట్లు ఎంపీలు తెలిపారు. ధాన్యం సేకరణపై 26న తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు, ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులతో భేటీ అంశాలను నేతలు సీఎంకు వివరించారు. చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని