Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈవిషయంపై గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు...

Published : 27 Nov 2021 01:09 IST

దిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈవిషయంపై గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్‌ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

‘‘80..85లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తామని గత సమావేశంలో చెప్పారు. ఇప్పుడేమో.. ఏడాది టార్గెట్‌ ఇప్పుడే ఎలా చెబుతామని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిర్దిష్టంగా చెప్పట్లేదు. ఎంత ధాన్యం తీసుకుంటారో కూడా స్పష్టం చేయడంలేదు. ఓ వైపు కొనుగోళ్లు జరుగుతుంటే.. ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చెప్పలేని దయనీయ స్థితిలో కేంద్రం ఉండటం చాలా బాధాకరంగా ఉంది. 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం తెలంగాణకు లేఖ ఇచ్చింది. దాన్ని పెంచమని కోరాం. ఆవిషయం ఈరోజు చెబుతారునుకున్నాం.. ఏడాది టార్గెట్‌ ఇస్తారనుకున్నాం. ఈ రెండూ చెప్పకుండా .. యాసంగిలో వరి వేయొద్దని మాత్రం గట్టిగా చెప్పారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, సురేష్‌రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని