Ap News: దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌.. రెండు రోజుల పాటు  ద.మ. రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - పడుగుపాడు, రాజంపేట - నందలూరు, రేణిగుంట - పూరి సెక్షన్ల మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నందున ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి చెన్నై సెంట్రల్ - ముంబయి...

Published : 22 Nov 2021 22:21 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - పడుగుపాడు, రాజంపేట - నందలూరు, రేణిగుంట - పూరి సెక్షన్ల మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నందున ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి చెన్నై సెంట్రల్ - ముంబయి సీఎస్టీ, చెన్నై సెంట్రల్ - ఎల్‌టీటీ ముంబయి, ముంబయి సీఎస్టీ - చెన్నై సెంట్రల్, ఎల్‌టీటీ ముంబయి - చెన్నై సెంట్రల్, బిలాస్‌పూర్ - తిరునల్వేళి రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 24న గోరఖ్ పూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని