TS News: మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ

రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

Updated : 08 Nov 2021 13:42 IST

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్‌ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్‌ 97లో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18న సర్వేకు హాజరుకావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డికి తూప్రాన్‌ ఆర్డీవో నోటీసులు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని