Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 30 May 2021 13:14 IST

1. Choksi: ఊచలు లెక్కిస్తున్న వజ్రాల వ్యాపారి

పరారీలో ఉన్న ప్రముఖ వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కటకటాల వెనుక నిర్బంధించిన ఓ చిత్రాన్ని స్థానిక మీడియా శనివారం బహిర్గతం చేయడంతో ఆయనను అరెస్టు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, జైలులో ఆయన చిత్రహింసలకు గురిచేసినట్లు చోక్సీ తరఫు న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ ఆరోపించారు. అందుకు సంబంధించి చోక్సీ శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS News: ఎన్నికుట్రలు చేసినా భయపడం: ఈటల జమున

తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు. తాము కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు.  ప్రణాళిక ప్రకారం పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ అందర్నీ సమానంగా చూశారు: సజ్జల

వైకాపా రెండేళ్ల పాలనలో మునుపెన్నడూ చూడని అభివృద్ధిని సీంఎ జగన్‌ సాధించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుణాత్మక మార్పు తీసుకొస్తారని ప్రజలు పెట్టుకున్న ఆశలను జగన్‌ నెరవేర్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ‘ప్రజాపాలనకు రెండేళ్లు’ పేరిట తయారు చేసిన ప్రత్యేక కేక్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి కట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Raghurama: రాజ్‌నాథ్‌తో రఘురామ భేటీ

4. Boris Johnson: బ్రిటన్‌ ప్రధాని రహస్య పరిణయం?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ప్రియురాలు కారీ  సైమోడ్స్‌నే పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నాయి.  సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొనేందుకు చివరి నిమిషంలో  అతిథులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ పెళ్లి విషయం ప్రధాని కార్యాలయంలో సీనియర్‌ అధికారులకు కూడా తెలియనీయలేదు. వీరి పెళ్లి జరిగిన కేథలిక్‌ కెథడ్రాల్‌ని మధ్యాహ్నం 1.30 సమయంలో మూసివేశారు. ఒక అర్ధగంట తర్వాత 33 ఏళ్ల సైమోడ్స్‌ లిమోజిన్‌ వాహనంలో అక్కడకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Oxygen: విష సర్పానికి నోటితో ఆక్సిజన్‌!

పామును చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కొంత ధైర్యం చేసే వాళ్లు దాన్ని కర్రతో కొట్టేందుకే చూస్తారు. కానీ.. ఓ వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ నాగుపాము(కోబ్రా)కు నోటితో ఆక్సిజన్‌ అందించి రక్షించాడు. ఈ సంఘటన ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. నువాగూడ షాహీలో ఓ వ్యక్తి తన ఇంట్లోకి పాము రావడంతో స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఆ సర్పం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బుల్లెట్‌ కోసం వరుడి డిమాండ్‌.. షాక్‌ ఇచ్చిన వధువు

వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. పర్తాపుర్‌ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్‌ ఖాన్‌ కూతురు కుల్సుమ్‌కు జీషన్‌ ఖాన్‌తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Crime: డిజిటల్‌ వేధింపులు.. ముందే జాగ్రత్త పడండి

7. India Corona: కరుగుతున్న కరోనా కేసుల కొండ!

దేశంలో కరోనా కేసులు, మరణాలు వరుసగా మూడోరోజైన ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,65,553 కేసులు, 3,460 మరణాలు నమోదయ్యాయి. రెండు లక్షలకు దిగువన కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది మూడోరోజు. ఇంతవరకు మొత్తంగా కేసుల సంఖ్య 2.79 కోట్లకు చేరువ కాగా, మహమ్మారి బారిన పడి 3,25,972 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.17 శాతంగా ఉంది. రోజువారీ మరణాలు గత ఐదు రోజుల కంటే తక్కువ నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Vijay: ఇది కదా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఆయన కథానాయకుడిగా త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌లో పేరు పొందిన డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వంశీ బయటపెట్టారు. ‘విజయ్‌తో ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. విభిన్నమైన కథ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తాం’ అని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. adventure: తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం

తల్లి ప్రోత్సాహం ఉంటే ప్రపంచంలో ఎంతటి పనైనా సాధ్యమే. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టుకుని నడిపించే అమ్మ.. మన వెన్నంటే ఉండి ధైర్యం చెబితే ఆ ఉత్తేజం అంతా ఇంతా కాదు. అలాంటి స్ఫూర్తినిచ్చే వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. నడవడానికే ఇబ్బంది పడే ఓ చిన్నారి తన తల్లి ఇచ్చిన ధైర్యంతో చేసిన పని నెటిజన్ల మదిని దోచుకుంటోంది. ఆంటోనెలా అనే చిన్నారికి ఒక కాలు లేదు. ఆమెకు కృత్రిమ కాలు అమర్చారు. ఓ చిన్న గొయ్యి నుంచి పైకి ఎక్కేందుకు తను చేసిన ప్రయత్నానికి తన తల్లి ప్రోత్సాహం తోడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Dhoni: కెరీర్ మొత్తంలో మహీ అదొక్కటే చేశాడు..

 ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ధోనీలాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. అది టీ20 ప్రపంచకప్‌లో కంగారూలకు ప్రతికూలాంశమని అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు. ఫినిషర్‌ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అన్నాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Sachin: 200 కొట్టకముందే హెచ్చరించాడు.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని