Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jun 2021 13:08 IST

1. AP News: అప్ప‌టి వ‌ర‌కూ అదే హ‌నుమ జ‌న్మ‌స్థ‌లం

అంజ‌నాద్రే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(తితిదే) ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే దీనిపై వ‌స్తున్న అన్ని వివాదాలు స‌ర్దుకుంటాయ‌ని చెప్పారు. అంజ‌నాద్రే హ‌నుమ జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తితిదే వ‌ద్ద ఉన్న ఆధారాలు చూపామ‌న్నారు. ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌లంపై గోవిందానంద స‌ర‌స్వ‌తి చూపిన ఆధారాలు స‌రిగా లేవ‌ని చెప్పారు. తితిదే కంటే బ‌ల‌మైన ఆధారాలు ఎవ‌రైనా చూపిస్తే అప్పుడు ఈ విష‌యంపై పునారాలోచ‌న చేస్తామ‌ని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం: సురేష్‌

ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీర‌తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ స్ప‌ష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు దీనిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మంత్రి మండిప‌డ్డారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఎంపీ భ‌రత్‌తో క‌లిసి ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సురేష్ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Biological-E: టీకా ధర రూ. 500/2 డోసులు

ఫార్మా సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకా దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్‌ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. అంటే ఒక్కో డోసు కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Vaccine: స్వల్ప సాయం.. పెద్ద వ్యూహం

4. Raghurama: సీఐడీ అద‌న‌పు డీజీకి లీగ‌ల్ నోటీసు

ఏపీ సీఐడీ అద‌న‌పు డీజీకి ఎంపీ ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది లీగ‌ల్ నోటీసు పంపించారు. ర‌ఘురామ‌ను అరెస్టు చేసే స‌మ‌యంలో తీసుకున్న వ‌స్తువుల‌ను మెజిస్ట్రేట్ వ‌ద్ద జ‌మ చేయాల‌ని మంగ‌ళ‌గిరి సీఐడీ ఎస్‌హెచ్‌వోకు నోటీసు పంపారు. ఎంపీని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి మొబైల్ ఫోన్ తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. అందులో విలువైన స‌మాచారం ఉంద‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది నోటీసులో వివ‌రించారు. ఇత‌ర అంశాల‌తో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాల‌ని ఎంపీని క‌స్ట‌డీలో హింసించార‌ని న్యాయ‌వాది పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వెంకయ్యనాయుడి ట్విటర్‌.. ‘బ్లూటిక్‌’ వివాదం

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు బ్లూ వెరిఫైడ్‌ టిక్‌ మార్క్‌లను సోషల్‌మీడియా సంస్థ శనివారం తొలగించింది. అయితే కొద్ది గంటల తర్వాత మళ్లీ ఆయన ఖాతాకు బ్లూ టిక్‌లు పెట్టడం గమనార్హం. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్న సమయంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అధ్యక్షుడి ట్వీట్‌ తొలగింపు..ట్విటర్‌పై వేటు!

6. ఇక మొబైల్‌లోనే ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌వ‌చ్చు..

కొత్త సాంకేతిక‌త‌ను అందింపుచ్చుకుని.. దాని ద్వారా వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎప్పుడూ ముందుంటుంది. ప‌న్ను చెల్లింపుదారులు, త‌మ రిట‌ర్నుల‌ను సుల‌భంగా దాఖ‌లు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్ సేవాల‌ను ఇప్ప‌టికే అందిస్తుంది. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో కూడా ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు వీలుగా మొబైల్ అనువ‌ర్త‌నం(యాప్‌)ను తీసుకొస్తుంది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌న్ను చెల్లింపుదారుల‌కు తెలియ‌జేసింది ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Lockdown: మహారాష్ట్రలో ఐదు దశల్లో అన్‌లాక్‌!

కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో మగ్గిన మహారాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఉపశమనం లభించనుంది. మొత్తం ఐదు దశల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల అందుబాటును దృష్టిలో ఉంచుకుని అన్‌లాక్‌ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత ఆధారంగానే ఆంక్షల సడలింపు ఉంటుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: క్రమంగా తగ్గుతున్న కేసులు

8. Rishabh Pant: పంత్‌ది సెహ్వాగ్‌ లాంటి ఎఫెక్ట్‌

వీరేంద్ర సెహ్వాగ్‌, గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థి జట్లపై చూపించిన ప్రభావమే రిషభ్ పంత్‌ చూపిస్తున్నాడని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ వల్ల వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంతోమంది బయటకు వచ్చారన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కీపర్లలో సాహా ఒకడని ప్రశంసించాడు. ఫిట్‌నెస్‌ ఉన్నంత వరకు క్రికెట్‌ ఆడతానని స్పష్టం చేశాడు. క్రికెట్‌ వ్యాఖ్యానం చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. The Family Man 2: నేను భయపడ్డా: సామ్‌

అగ్రకథానాయిక సమంత అక్కినేని కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌-2’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cinema News: మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా

10. TS News: రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు

స‌ర్వ‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. ఈ స‌మ‌స్య‌తో రెండు రోజులుగా న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న రిజిస్ట్రేష‌న్లు పూర్తిగా ఆగిపోయాయి. ఇవాళ‌ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంకా స‌ర్వ‌ర్ క‌నెక్ట్ కాలేదు. దీంతో క్ర‌య విక్ర‌య‌దారులు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం వర‌కే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేస్తుండటంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని