Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jun 2021 13:12 IST

1. cr7: క్రిస్టియానో.. 2 బాటిళ్లు..రూ.29 వేలకోట్లు..!

‘మంచి నీళ్లు తాగండి’ అని ఒక స్పోర్ట్స్‌ ఛాంపియన్‌ యథాలాపంగా చెప్పిన మాటతో ఓ దిగ్గజ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.29 వేల కోట్ల మేరకు ఆవిరైపోయింది. ఇంటర్నెట్‌లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ ఛాంపియన్‌ అదే రోజు చరిత్రలో నిలిచిపోయే అరుదైన రికార్డు సాధించాడు. కానీ.. పతాక శీర్షికల్లో ఉండాల్సిన ఆ వార్త ఈ వివాదం దెబ్బకు ఎక్కడో మరుగున పడిపోయింది. ఇంతకీ ఆ ఛాంపియన్‌ ఎవరంటారా..? అభిమానులు సీఆర్‌7 అని ముద్దుగా పిలుచుకొనే క్రిస్టియానో రొనాల్డో..! ఇక ఆ బాధిత కంపెనీ కోకకోలా..!! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ అందక చిన్నారి మృతి

వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అది. రాజస్థాన్‌లోని బీకానేర్‌ జిల్లాలో 6 నెలల పాప నూర్‌ ఫాతిమాకు వచ్చింది. నయం చేయాలంటే ఒక ఇంజెక్షన్‌ అవసరం. కానీ అది భారత్‌లో దొరకదు. విదేశాల నుంచి తెప్పించాలంటే రూ.16 కోట్లు ఖర్చవుతుంది. అంతటి స్తోమత ఆ పాప తల్లిదండ్రులకు లేదు. దాంతో ఇంజెక్షన్‌ అందక ఆ చిన్నారి మరణించింది. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జన్యువు లోపం వల్ల ఈ నాడీ సంబంధిత వ్యాధి వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 9లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు

3. Twitter: ‘మధ్యవర్తి హోదా’ కోల్పోయిన ట్విటర్‌

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర  ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP News: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

విశాఖప‌ట్నం జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మ‌చారంతో మంప పీఎస్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జ‌రిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: ఏటీఎం చోరీకి వెళ్లి..తేలు కుట్టిన దొంగల్లా!

5. పోయిన ఉంగరం 63 ఏళ్ల తర్వాత మళ్లీ..!

పాతకాలం నాటి ఓ అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు దొరికిన ఓ బంగారు ఉంగరాన్ని.. అది ఎవరిదో వారి వద్దకు చేర్చాలనుకుంది. అందుకు ఏకంగా డిటెక్టివ్‌ అవతారమెత్తి చివరకు అనుకున్నది సాధించింది. ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఉంగరం వెతుక్కుంటూ తన వద్దకు రావడంతో ఆ వృద్ధుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. TS News: తెరాస ఎంపీ నామాకు ఈడీ స‌మ‌న్లు

బ్యాంకు రుణాల‌ మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో తెరాస లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స‌మన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అందులో పేర్కొంది. నామాతో పాటు మ‌ధుకాన్ కేసులో నిందితులంద‌రికీ ఈడీ స‌మ‌న్లు పంపింది. ఎంపీకి చెందిన మ‌ధుకాన్ సంస్థ‌తో పాటు, గ్రూప్ డైరెక్ట‌ర్ల ఇళ్ల‌లో ఈడీ ఇటీవ‌ల రెండు రోజుల పాటు సోదాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS news: హైద‌రాబాద్‌లో ఓ యువ‌తిపై 22 చ‌లాన్లు

7. Myanmar: శరణార్థిగా ముఖ్యమంత్రి..

మయన్మార్‌లో సైనిక పాలకుల దాష్టీకంతో అక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భారత్‌లోనూ అనేక మంది ఆశ్రయం పొందారు. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దేశానికి శరణార్థిగా వచ్చినట్లు తెలిసింది. మయన్మార్‌లోని చిన్‌ రాష్ట్ర సీఎం సలై లియాన్‌ లుయాయ్‌ మిజోరంలో ఓ శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. లుయాయ్‌.. సోమవారం రాత్రి చంపాయ్‌లోని సరిహద్దును దాటి మిజోరంకు వచ్చినట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Nagarjuna: ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ!

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ముస్తాబవుతోంది. నారాయణదాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్‌ మొదలవనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tollywood Heroins: కొత్త సినిమా కబురేది?

9. WTC Final: ప్చ్‌..! ఫైనల్‌కు వర్షగండం

ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ దుర్వార్త! సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగడం పొంచివుంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. దాదాపుగా 80% వర్షం కురుస్తుందనే చూపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Subhreet: నెటిజన్ల హృదయాలు గెలిచిన డ్యాన్సర్‌

బుల్లితెర, వెండితెరలపై ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, డ్యాన్సర్లు తమదైన శైలిలో డ్యాన్స్‌ చేసి, ప్రేక్షకులను అలరించిన సందర్భాలెన్నో. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. అలాంటి వారిలో శుభ్రీత్‌ కౌర్‌ గుమ్మాన్‌ ఒకరు. అంగవైకల్యాన్ని సైతం ఆత్మ విశ్వాసంతో అధిగమించి ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’లో సెకండ్‌ రౌండ్‌కు క్వాలిఫై అవడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకోగా.. విశేష స్పందన వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని