Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2021 14:15 IST

1. kim: కిమ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి..!

ఉత్తరకొరియా నియంత కిమ్‌ తొలిసారి అధ్యక్షుడు బైడెన్‌ సర్కారుపై చేసిన వ్యాఖ్యలకు అమెరికా స్పందించింది. గత వారం కిమ్‌ అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ‘‘చర్చలకైనా.. యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి’’ అని తన సేనలకు సూచించారు. ఆదివారం ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందిస్తూ.. దీనిని మేము ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నాం అని పేర్కొంది. కానీ, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై చర్చలకు ప్యాంగ్యాంగ్‌ నుంచి నేరుగా కచ్చితమైన సంకేతాలు రానంత కాలం తాము వేచిచూస్తామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WTC Final: 4వ రోజు మొత్తంగా ఆట కుదరదా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగోరోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు అతి భారీ, ఆ తర్వాత మోస్తరు జల్లులు కురుస్తాయని అంటున్నారు. సాయంత్రానికి కాస్త తెరపినిచ్చినా వెలుతురు ఉండదని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* WTC Final: ఆ బంతికి విరాటేంటి ఎవరైనా ఔటే!

3. AP News : జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో యువత ఆందోళన బాట పట్టింది. విద్యార్థి సంఘాలు ఈ ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Google Maps: గూగుల్‌ చూపిన రహస్య దీవి 

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది. కోచి తీరానికి 7 కి.మీ దూరంలో ఇది ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు జేవీఆర్‌ జుల్లప్పన్‌ చెప్పారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. SonuSood: ఆ కారు నేను కొనలేదు

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌.. తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని తాజాగా ఆ కారుని ఇంటికి కూడా తీసుకువచ్చారంటూ పలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే సదరు వార్తలపై సోనూసూద్‌ స్పందించారు. ఆ కారుని తాను కొనుగోలు చేయలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rakul: క్లిక్స్ కోసం ఏదైనా రాసేస్తారా

6. mYoga App: యోగా సహచరి..ఎమ్‌-యోగా

 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎమ్-యోగా పేరిట ఒక మొబైల్‌ యాప్‌ను పరిచయం చేశారు. దీనిద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో యోగా శిక్షణ వీడియోలను విడుదల చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన శాస్త్రాల కలయికకు ఈ యాప్ ఒక ఉదాహణగా నిలువనుంది అని ఈ యోగ దినోత్సవాన చేసిన ప్రసంగంలో మోదీ ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Corona: మూడు నెలల కనిష్ఠానికి కొత్త కేసులు

 దేశంలో రోజురోజుకూ కరోనావైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,88,699 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..53,256 కొత్త కేసులు వెలుగుచూశాయి. రోజువారీ కేసులు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. తాజాగా మరో 1,422 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఏప్రిల్ 17 తరవాత మరణాల్లో ఈ స్థాయి తగ్గుదల తొలిసారి నమోదైంది. ఇప్పటి వరకు 2,99,35,221 మందికి కరోనా సోకగా..3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Cinema news: ‘యోగా’ భామలు

మూడు పదుల వయసైనా దాటకముందే మనకు జుట్టు రాలిపోవడం.. శరీరాకృతిని కోల్పోవడం ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే.. మనతో పాటే ఈ కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవిస్తున్న హీరోయిన్ల ఫిట్‌నెస్‌ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించక మానదు. మరి మనకు వాళ్లకు తేడా ఏమిటీ..? వాళ్లు అంత అందంగా.. ఫిట్‌గా ఉండటం ఎలా సాధ్యమవుతుందంటారు.? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే జవాబు ఒక్కటే..! ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు యోగా చేయటం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* yoga: యోగా చేస్తున్నారా.. అయితే ఇవి తాగండి

9. ఏటీఎమ్‌ల్లో నగదు విత్‌డ్రా.. ఉచితం అంటున్న బ్యాంకులు ఏవి? 

ఏటీఎమ్ వ‌ద్ద చేసే న‌గ‌దు, న‌గ‌దు ర‌హిత లావాదేవీల ఛార్జీల‌ను పెంచేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకుల‌ను ఇటీవ‌లె అనుమ‌తించింది. అయితే ఆర్‌బీఐ నిర్ణ‌యించిన ప‌రిమితి మేర‌కు ఉచిత లావాదేవీల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అంత‌కుమించిన లావాదేవీల‌కు మాత్ర‌మే ఈ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. బ్యాంకు ఖాతాదారులు ప‌రిమితికి మించి చేసే ఒక్కో లావాదేవీకి ₹20కి బ‌దులుగా ₹21 వ‌ర‌కు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ పెరిగిన ఛార్జీలు జ‌న‌వ‌రి1,2022 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Crypto currency: కలయా.. నిజమా..

ప్రతిరోజూ పొద్దున లేస్తూనే ఫోను చూసుకోవడం.. క్రిప్టోకరెన్సీ లెక్కలు వేసుకోవడం అలవాటున్న క్రిస్‌ విలియమ్స్‌ ఇటీవల ఓ రోజు ఫోను చూసి షాక్‌కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని కళ్లు నులిమి చూసుకున్నాడు. లేదు.. వాస్తవమే. క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన ఇతను రాత్రికి రాత్రే ట్రిలియనీర్‌ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్‌లో చదువుకుంటున్న క్రిస్‌ విలియమ్స్‌ ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని