Updated : 14/08/2021 13:18 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

​​​​​​

1. VVS Laxman:పుజారా, రహానె చేసిన తప్పే మళ్లీమళ్లీ చేస్తున్నారు!

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా చేసిన పొరపాటునే పదేపదే చేస్తున్నారని క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. త్వరగా పరుగులు చేయాలన్న ఆత్రుతతో తప్పులు చేస్తున్నారని వివరించారు. ముఖ్యంగా వారిని బయటి విమర్శలు ఇబ్బందికి గురిచేస్తున్నట్టు అనిపిస్తోందని వెల్లడించారు. లార్డ్స్‌ టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

KL Rahul frustrated: కేఎల్‌ రాహుల్‌కు చిరాకేసిందట!

2. UN: అఫ్గాన్‌ పట్టు కోల్పోతోంది.. మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోంది

తాలిబాన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Ruckus in Parliament : ఆ దేశ చట్ట సభల్లోనూ.. ఇలాంటి ఘటనలే

పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలపై చర్చ జరపాలని పట్టుబట్టి విపక్షాలు నిరసనలకు దిగడంతో ఈసారి పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగలేదు. సభ్యులు దూకుడుగా వ్యవహరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, కాగితాలు చించి విసరడం, ఫైల్స్ లాగడం వంటి చర్యలతో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ వైఖరి అటు లోక్‌సభ స్పీకర్ ఓ బిర్లా, ఇటు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని బాధించింది. ఈ పరిణామాల పట్ల ఒక దశలో భావోద్వేగానికి గురైన వెంకయ్య కంటతడి కూడా పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rahul Gandhi: రాహుల్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

4. Tirumala: శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్ల బెడద ఇంటి దొంగలపై విజిలెన్సు ఆరా 

 తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లను అంటగడుతూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాల్లో తితిదే ఉద్యోగుల పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమానితుల కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం పరిమితంగానే భక్తులను అనుమతిస్తున్నారు. దీని ఆసరాగా కొందరు దళారులు సామాన్యులను మోసం చేస్తున్నారు. పాత కల్యాణోత్సవ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి దాన్ని మార్ఫింగ్‌ చేసి భక్తుల పేర్లను అందులో జోడిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP News: కృష్ణా నదిలో చిక్కుకున్న వందకుపైగా లారీలు..

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: పుస్తకాలకెక్కింది.. ఆ గ్రామాల స్ఫూర్తి!

6. Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా? ఇవన్నీ అపోహలే!

సాధారణంగా ఏవైనా అత్యవసర ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే మనమంతా వెంటనే సంప్రదించే మార్గం వ్యక్తిగత రుణం(పర్సనల్‌ లోన్‌). ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభం సమయంలో అనేక మంది రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణంపై ఉన్న అపోహల కారణంగా కొంతమంది అర్హత ఉన్నా.. ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. మరి ఆ అపోహలేంటి?అందులో నిజమెంతో చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Vishwaksen: సినిమా విడుదలకు కొన్నిగంటల ముందు సినీప్రియులకు విశ్వక్‌ లేఖ

నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి మాస్‌ సినిమాల్లో నటిస్తూ ‘మాస్‌ కా బాప్‌’గా పేరు తెచ్చుకున్నారు విశ్వక్‌సేన్. మొదటిసారి ఆయన పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్రలో నటించిన చిత్రం ‘పాగల్‌’. శనివారం (ఆగస్టు 14) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం అర్ధరాత్రి సినీ ప్రియులను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారు. తమ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే విమర్శించమని తెలిపారు. సినిమా థియేటర్స్‌ని కాపాడమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Radhika Apte: ఐదేళ్ల తర్వాత రాధిక ఆప్టేకు ‘పార్చ్‌డ్‌’ సెగ

8. USA: బహుళ జాతుల దేశంగా అమెరికా.. తగ్గుతున్న తెల్లవారి జనాభా

అమెరికా క్రమేణా బహుళ జాతుల సమ్మిళిత దేశంగా రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దంగా శ్వేత జాతీయుల ఆధిక్యం తగ్గుతుండడంతో పాటు, ఇతర జాతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం సెన్సస్‌ బ్యూరో విడుదల చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడయింది. 1790 నుంచి ఇక్కడ జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Modi: ఆగస్టు 14ను ‘విభజన స్మృతి దివస్‌’గా జరుపుకోవాలి

భారత్‌, పాక్‌ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అందుకే ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇకపై ఆగస్టు 14ను ‘విభజన స్మృతి దివస్‌(Partition Horrors Remembrance Day)’గా జరుపుకొందామని ప్రధాని శనివారం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Ola Electric Scooter: రేపే `ఓలా` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ప్రారంభం

10. Corona: మరోసారి స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు

 దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా 22,29,798 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,667 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 478 మంది మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లకు చేరగా.. మరణాలు 4.30లక్షల మార్కును దాటాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని