Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Aug 2021 13:30 IST

1. Zydus Cadila: సూదిలేకుండా టీకా ఇలా.. వీక్షించండి..!

 జైడస్‌ క్యాడిలాకు చెందిన తొలి డీఎన్‌ఏ టీకా  జైకోవ్‌డీకి కేంద్రం అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఈ టీకా తీసుకోవాలంటే సూది అవసరం లేదు. దీంతో సూదిలేకుండా టీకా ఎలా..? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే చర్మం పొరల మధ్యలోకి టీకాను పంపించేందుకు ఓ ప్రత్యేకమైన పరికరం ఇందుకోసం వాడనున్నారు. దీంతో సూదికి భయపడే వారు ఇప్పుడు నిర్భయం గా టీకాను వేయించుకోవచ్చు. ముఖ్యంగా జైడస్‌ టీకా 12ఏళ్ల పిల్లలకు కూడా ఇవ్వనుండటంతో వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇంటింటికీ వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించాం: జగన్‌

లక్షల మంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్లను ఆయన జమ చేశారు. అనంతరం జగన్‌ మాట్లాడారు. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి పేదలు, చిన్న వ్యాపారులు మోసపోయారన్నారు. ఎవరూ నష్టపోకూడదని ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Corona Vaccine: ఇక వాట్సాప్‌లోనూ టీకా ‘స్లాట్‌ బుకింగ్‌’

కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ వీలైనంత వేగంగా అర్హులైన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్‌ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇకపై వాట్సాప్‌లోనూ టీకా స్లాట్‌ను బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: హమ్మయ్య.. 1శాతం దిగువకు క్రియాశీల రేటు

4. Billionaires Education: ఈ ధనవంతులు ఏం చదివారో తెలుసా?
కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వారి చదువు గురించి ఎప్పుడైనా వెతికారా? ప్రపంచంలోనే శ్రీమంతులుగా ఉన్న కొంతమంది విద్యార్హత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొంత మంది ఉన్నత చదువులు లేకుండానే రూ.లక్షల కోట్ల సామ్రాజ్యాలను నిర్మించారు. ఫోర్బ్స్‌ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న కొంతమంది కుబేరుల విద్యార్హతలేంటో చూద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Telangana Schools Reopen: బడికి పంపడం తల్లిదండ్రుల ఇష్టమే!

ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినా పిల్లలను తప్పక ప్రత్యక్ష తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారులు మాత్రం తప్పనిసరిగా పంపాలని చెప్పబోమంటున్నారు. అంటే పిల్లలను బడులకు పంపాలా? ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చా? అన్నది తల్లిదండ్రుల ఇష్టమేనని స్పష్టమవుతోంది. టీవీల ద్వారా డిజిటల్‌ పాఠాలు యథావిధిగా కొనసాగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Gujarat High Court: బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని అవివాహితను ఒత్తిడి చేయగలమా?

‘‘ఆమెకు ఇంకా వివాహం కాలేదు.. అయినా తల్లి అయ్యింది!...తాను జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరో వెల్లడించాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుందా? ఆ చిన్నారి జన్మకు కారకుడైన వ్యక్తి పేరును వెల్లడించాల్సిందేనని ఆమెను ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో...సమాధానం తెలిసినా బహిర్గతం చేయని ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?’’ అంటూ ధర్మ సంకటమైన పలు ప్రశ్నలను గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి రేకెత్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. INDvsENG: : రూట్‌ కెప్టెన్సీపై మండిపడ్డ నాసర్‌ హుస్సేన్‌

లార్డ్స్‌ వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఆ జట్టు మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌.. రూట్‌ కెప్టెన్సీపై చిటపటలాడాడు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డాడు. ఐదోరోజు ఆటలో టీమ్‌ఇండియా టెయిలెండర్లు బుమ్రా(34), షమి(56) నాటౌట్‌గా నిలిచి రికార్డుస్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Narayan Rane: ‘నేనక్కడ ఉంటేనా.. ఉద్ధవ్‌ ఠాక్రే చెంప పగిలేది..!’

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని ఎద్దేవా చేసిన రాణే.. ఇందుకు ఠాక్రే చెంప పగలగొట్టాలని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Corona Vaccine: మూడో డోసు పడితేనే డెల్టాకు మూడుతుంది!

 కొవిడ్‌-19 కట్టడికి మూడో డోసు ఇచ్చే అంశం నేడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇప్పటికీ మొదటి రెండు డోసులనే పొందని దశలో ఇది సరైన ఆలోచనేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలు మాత్రం బూస్టర్‌ డోసుల ఆవశ్యకతను సూచిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనాలోని డెల్టా వేరియంట్‌. అధిక సాంక్రమిక శక్తి కలిగిన ఈ రకానికి, మానవ రోగ నిరోధక వ్యవస్థకు మధ్య నేడు ఒకింత పోటీ నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: మూడుచింతలపల్లిలో తెరాస, కాంగ్రెస్‌ పోటాపోటీ ఫ్లెక్లీలు

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దళిత దండోరా కార్యక్రమం చేపట్టింది. కాగా, తెరాస నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెరాస ఫ్లెక్సీల్లో కేసీఆర్ దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల విలువతో కూడిన పూర్తి వివరాలను పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ, తెరాస పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని