Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Sep 2021 13:12 IST

1. Panjshir vs Taliban: పంజ్‌షేర్‌లో పాపిస్థాన్‌ రక్తపు చేతులు..! 

ప్రపంచ దేశాలు మొండి చేయి చూపడంతో పంజ్‌షేర్‌లోని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. మరోపక్క తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్‌ బహిరంగంగానే మద్దతు ఇస్తోంది. ఇన్నాళ్లు ‘మాకు తెలియదు.. తాలిబన్లకు మేం సాయం చేయడం లేదు’ అని చెప్పిన దాయాది.. తాజాగా నేరుగా తన డ్రోన్లను పంజ్‌షేర్‌కు పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఈ డ్రోన్లను పంజ్‌షేర్‌ దళాలపై దాడి చేయడానికి వినియోగించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Taliban: తాలిబన్ల పైశాచికత్వం.. గర్భిణీ పోలీసు అధికారిణిని కాల్చి చంపిన వైనం

2. Nara Lokesh: పింఛన్లు పెంచుతానన్న జగన్‌‌‌.. తుంచుకుంటూ పోతున్నారు: లోకేశ్‌

ఏపీలో పింఛన్లు పెంచుతానన్న సీఎం జగన్‌.. వాటిని తుంచుకుంటూ పోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. రెండు నెలల్లోనే 2.3లక్షల ఫించన్లు తొలగించి అవ్వాతాతలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పింఛన్ల కోత వల్ల మానసిక క్షోభకు గురై రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది వృద్ధులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రూ.2,750 పింఛన్‌ ఇవ్వాల్సి ఉండగా.. ఆ మేరకు పెరగలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Supreme Court: మా సహనాన్ని పరీక్షిస్తున్నారా..? జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. India T20 WC Team: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టు ఇదేనా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును బీసీసీఐ సెలక్టర్ల బృందం ఎంపిక చేసింది. బహుశా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం జట్టును ప్రకటిస్తారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోనే ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సమావేశమైందని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొందరి స్థానాల గురించి చర్చించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Ravi shastri: శాస్త్రికి కరోనా అని తెలియగానే కుర్రాళ్లు ఎలా కలత చెందారంటే..!

5. Corona: 40వేల దిగువకు కొత్త కేసులు, భారీగా తగ్గిన మరణాలు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా 40వేల పైనే ఉంటోన్న కేసులు.. తాజాగా ఆ మార్క్‌ దిగువకు పడిపోయాయి. అటు మరణాల్లోనూ భారీ తగ్గుదల కన్పించడం కాస్త ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో 38,948 కొత్త కేసులు బయటపడగా.. 219 మంది మృత్యువాతపడ్డారు. క్రితం రోజు(42వేలు)తో పోలిస్తే 8.9శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. ఇక ఇప్పటివరకు 4,40,752 మందిని వైరస్‌ బలితీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Kerala: అతడు మా ఆవులపై అత్యాచారం చేస్తున్నాడు

కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్‌లోని కొందరు రైతులకు విచిత్ర సమస్య తలెత్తింది. వారంతా.. తమకు జీవనాధారమైన ఆవులను అమ్మేసుకుంటున్నారు. ఇలా ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. వారి ఆవులపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడట. ఇదే గోడు పోలీసులకు చెప్పారు. ఇక్కడ 20 మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 2021 జనవరి నుంచి తరచూ వారి ఆవులపై దాడి జరుగుతోంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Maruti Suzuki: పెరిగిన మారుతీ సుజికీ కార్ల ధ‌ర‌లు.. నేటి నుంచి అమ‌ల్లోకి కొత్త ధ‌ర‌లు 

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. త‌మ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు గ‌త సోమ‌వారం (ఆగ‌ష్టు 30న‌) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పెంచిన ధ‌ర‌లు నేటి(సెప్టెంబ‌రు6,2021) నుంచి అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. అద‌న‌పు ఇన్‌పుట్ వ్యయాలు కార‌ణంగానే ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు వివ‌రించింది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయం వంటి ఇన్‌పుట్ వ్యయాల కార‌ణంగా ఎంపిక చేసిన మోడ‌ల్స్‌పై ధ‌ర‌లను మార్పు చేస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Credit Card: క్రెడిట్‌ కార్డు.. ఐదు హెచ్చరికలు!

8. Landmine: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పేలిన మందుపాతర

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు విధ్వంస కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లా లెనిన్‌ కాలనీ సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి సదరు వ్యక్తి వాహనంతో పాటు ఎగిరిపడ్డాడు. స్థానికులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘స్వగృహ’ ఫ్లాట్ల వేలం!.. అపార్ట్‌మెంట్లతో పాటు  ఖాళీ భూములు కూడా..

సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ‘స్వగృహ’ ఫ్లాట్లను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విడివిడిగా కాకుండా ప్రాజెక్టుల వారీగా గుండుగుత్తగా అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం. కనీస ధర ప్రకటించి వేలం పద్ధతిలో రియల్టర్లకు విక్రయించే కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు అమ్ముడుపోని ఫ్లాట్లు, ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూముల వివరాలను  రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ అధికారులు తాజాగా అందించినట్లు సమచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Vijay Sethupathi: కృతిశెట్టితో సినిమా చేయలేను: విజయ్‌ సేతుపతి

కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. కృతిశెట్టి-వైష్ణవ్‌ తేజ్‌ జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి ఆమె తండ్రి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో విజయ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. కాగా, తాజాగా ‘లాభం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని