Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Nov 2021 13:09 IST

1. china: చైనా దీర్ఘకాలిక యుద్ధ సన్నద్ధత..!

భారత్‌, తైవాన్‌లే లక్ష్యంగా డ్రాగన్‌ దీర్ఘకాలిక యుద్ధ సన్నాహాలు చేస్తోంది. భారత్‌ వైపు దాదాపు 3 వేల కిలోమీటర్ల పైనున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలకు ప్రయత్నిస్తూ కవ్విస్తుండగా.. మరోవైపు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి డజన్ల కొద్దీ విమానాలను పంపిస్తోంది. ఈ చర్యల వెనుక చైనా దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ ‘చైనా మిలటరీ పవర్‌ రిపోర్ట్ 2021’ నివేదికను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. T20 world Cup: టీమిండియా నిష్క్రమణపై.. మాజీలు ఏమన్నారంటే.?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. కివీస్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సెమీస్‌ అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ జట్టు స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌ని ఓడించి ఉంటే.. టీమిండియాకు సెమీ ఫైనల్‌ చేరే అవకాశం ఉండేది. ఎలాగంటే, సోమవారం నమీబియాతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: టీమిండియా పరాజయాలకు టాస్‌ కారణం కాదు: గావస్కర్‌

3. Padma Awards: ‘పద్మభూషణ్‌’ అందుకున్న పీవీ సింధు

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో సోమవారం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను నేడు ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గ్రహీతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Paytm IPO: నేడే దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారా మరి?

వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబరు 10న ముగియనుంది. మొత్తం రూ.18,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు; ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద రూ.10,000 కోట్లు సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌ పరిమాణంలో దాదాపు సగం విలువ యాంట్‌ఫిన్‌ గ్రూప్‌దే. పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ETF: ఈటీఎఫ్‌లో మదుపు.. రిస్క్‌ తక్కువ.. రిటర్న్స్‌ ఎక్కువ!

5. KTR: సోనూసూద్‌.. వాటికి భయపడాల్సిన పనిలేదు: కేటీఆర్‌

కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా సోనూసూద్‌ మానవత్వంతో సేవాభావం చాటుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారని కొనియాడారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనూసూద్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమొక్కటే అన్నీ చేయలేదని మంత్రి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Crime News: పంజాగుట్ట బాలికది హత్యే!

నగరంలోని పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలిక మృతదేహాన్ని ఓ మహిళ వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని ఎక్కడో చంపేసి నిందితులు ద్వారకాపురి కాలనీలో పడేశారు. నిందితులను సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Theenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

7. Wi Fi: వైఫై సృష్టి వెనుక అందాల హాలీవుడ్‌ తార! 

ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ.. ఆన్‌లైన్‌లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్‌ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్‌.. వైఫై సదుపాయం ఉండాలి. అందుకే ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టించుకొని కుటుంబసభ్యులంతా వైఫైతో మొబైల్‌/ల్యాప్‌ట్యాప్‌ వంటి డివైజ్‌లు వినియోగిస్తుంటారు. కేఫ్‌, రైల్వేస్టేషన్‌ వంటి పలుచోట్ల కూడా తప్పనిసరిగా వైఫై సదుపాయం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. AP News: అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌

ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరిస్తూ.. అందుకు సంబంధించిన పత్రాన్ని విద్యాశాఖ అధికారులకు సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: టోకెన్ల కోసం రైతుల ఆందోళన.. మిర్యాలగూడ-కోదాడ రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్‌

9. Sameer Wankhede: డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలు..?

మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నౌకలో ఏర్పాటుచేసిన పార్టీ పేరుతో ఆర్యన్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని, ఇందుకు సూత్రధారి సమీర్‌ వాంఖడేనే అని నిన్న సంచలన ఆరోపణలు చేసిన మాలిక్‌.. తాజాగా ఆయనపై మరిన్ని ఆరోపణలు చేశారు. వాంఖడే మరదలు హర్షదా దీనానత్‌ రేడ్కర్‌కు డ్రగ్స్‌ వ్యాపారాలతో సంబంధముందన్న ఆయన.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Tollywood:ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!

దసరా, దీపావళి పండగలతో వరుస సినిమాలు థియేటర్‌లో సందడి చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద వాటి టాక్‌ ఎలా ఉన్నా, కరోనా కారణంగా సినిమాలు లేక అల్లాడుతున్న సినీ ప్రియుల దాహాన్ని కాస్త తీర్చాయి. ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అవేంటో చూసేద్దామా! కార్తికేయ(karthikeya) హీరోగా సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘రాజా విక్రమార్క’(raja vikramarka). ఆదిరెడ్డి, రామారెడ్డి నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని