Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jan 2022 13:06 IST

1. AP News: చెరో పెట్రోల్‌ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం: బొండా ఉమ

ఏ తప్పూ చేయకుంటే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై కొడాలి నాని కూడా దీనిపై స్పందిస్తూ క్యాసినో, పేకాట నిర్వహించారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat- Ganguly: ఆ వార్తల్లో నిజంలేదు.. అర్థరహితం: సౌరభ్ గంగూలీ

టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని తాను భావించినట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కొట్టిపడేశాడు. ఇలాంటివి అర్థరహితమైనవిగా పేర్కొన్నాడు. అందులో నిజం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ గతేడాది పొట్టి ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL Mega Auction : ఐపీఎల్‌ మెగా వేలంలోకి 1,214 మంది.. విదేశీయుల్లో వారే టాప్‌

3. UP Polls: ‘సీఎం అభ్యర్థి నేనే’ అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక

యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్‌ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు. ‘కాంగ్రెస్ తరఫున నేను యూపీ సీఎం అభ్యర్థినని చెప్పలేదు. మీరు పదేపదే అదే ప్రశ్న అడగుతుండంతో.. చిరాకుగా అనిపించింది. అందుకే అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నాగా అన్నాను’ అంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Fire Accident: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురిమృతి

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్‌ ముంబయిలోని తాడ్‌దేవ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిధిలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Prabhas: ప్రభాస్‌ ఖాతాలో మరో మూడు.. మొత్తం8 ప్రాజెక్టుల్లో పాన్‌ ఇండియా స్టార్‌!

పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘సలార్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రభాస్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్రేక్‌ అనేది తీసుకోకుండా ఆయా సినిమా షూటింగ్స్‌లో ఆయన ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Priyanka Chopra: తల్లిదండ్రులైనప్రియాంక- నిక్‌ దంపతులు..!

6. బద్ధకస్థులకు ఆపద్బాంధవుడు ఫ్రెడ్డీ.. 

గంటల తరబడి క్యూలో నిలబడాలంటే చాలామందికి చిరాకు. ఒక్కోసారి ఓపిక నశించి వచ్చిన పని పూర్తి చేసుకోకుండానే వెనుదిరుగుతుంటారు. ఇలా బద్ధకించే ప్రబుద్ధులకు ఆపద్బాంధవుడిలా బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్‌ (31) క్యూల్లో నిల్చొని రోజుకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. గంటకు 20 యూరోలు (దాదాపు రూ.2 వేలు) ఛార్జ్‌ చేసే ఫ్రెడ్డీ రోజూ తన క్లయింట్స్‌ కోసం 8 గంటలు క్యూలో నిల్చుంటాడు. బ్రిటన్‌లో తరచూ ఈవెంట్లు జరుగుతాయి. వీటి టికెట్లు కావాలంటే కనీసం గంటైనా క్యూలో నిల్చోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బండి సంజయ్‌ ఫిర్యాదు.. సీఎస్‌ సహా పలువురికి లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు

భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్‌, ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్‌ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కూడా ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Budget 2022: ఈసారి బడ్జెట్‌ ఓ పెద్ద సవాల్‌.. కారణాలివే!

కరోనా సృష్టించిన ఉత్పాతం నుంచి ఇంకా ఉద్యోగ కల్పన పుంజుకోవాల్సి ఉంది. వేతన పెంపూ ఆశించిన స్థాయికి చేరలేదు. కరోనా కొత్త వేరియంట్లు ఆర్థిక పునరుత్తేజానికి ఇంకా బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యయాలూ బలంగానే ఉన్నాయి. కానీ, మహమ్మారి వ్యాప్తి ఎప్పుడు ముప్పును తెచ్చిపెడుతుందో ఇప్పటికీ అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ 2022-23ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... అయినా 3 లక్షల పైనే!

దేశంలో కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,37,704 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 48 వేల మందికి కరోనా సోకగా.. కేరళలో ఆ సంఖ్య 41 వేలుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Covid vaccine: పాజిటివ్‌ వస్తే.. మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్‌ డోస్‌

10. Maoist: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్య.. 12 వాహనాలకు నిప్పు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. బాంబ్రాగఢ్‌ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద దోదరాజ్‌ నుంచి కవండే వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోలు రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని