Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jan 2022 13:15 IST

1. AP PRC: మంత్రుల కమిటీతో చర్చలకు రండి.. ఉద్యోగ సంఘాలకు మరోసారి ఆహ్వానం

పీఆర్సీ అంశంపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం పంపారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖ కాన్ఫరెన్స్‌ హాలులో 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా స్టీరింగ్‌ కమిటీకి పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP PRC: ఏపీలో ఉద్ధృతంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం.. అన్ని జిల్లాల్లో నిరసనలు

2. Kohli : కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగింది: షేన్ వార్న్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-2 తేడాతో పరాజయం పాలైన అనంతరం.. టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ ముగింపు పలికిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు షాక్‌.. మళ్లీ పెరగనున్న ఛార్జీలు..!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafoe Idea) మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా మొబైల్‌ సర్వీసు రేట్లు పెరిగే అవకాశముందని కంపెనీ సీఈవో, ఎండీ రవీందర్‌ తక్కర్‌ వెల్లడించారు. అయితే మార్కెట్‌ స్పందను బట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం సోమవారం జరిగిన సమావేశంలో రవీందర్‌ తక్కర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. India Corona: ఊరట..మూడు లక్షల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొన్నాళ్లుగా 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. తాజాగా 2,55,874కి తగ్గాయి. అంటే నిన్నటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు క్షీణించాయి. 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు.. 15.52 శాతానికి పడిపోయింది. 16 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కర్ణాటకలోనే 46 వేల కేసులుండగా.. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Antibodies: ‘బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌’తో బలమైన యాంటీబాడీ స్పందన

5. Stock Market: భారీ ఊగిసలాటలో మార్కెట్‌ సూచీలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ ఊగిసలాట ధోరణిలో ట్రేడవుతున్నాయి. ఉదయం భారీ నష్టాల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,000 పాయింట్లకు పైగా పతనమైంది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు జరగడంతో అనూహ్యంగా పుంజుకొని స్వల్ప లాభాల్లోకీ ఎగబాకింది. కానీ, అది ఎంతోసేపు నిలవలేదు. వెంటనే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో తిరిగి 500 పాయింట్లు నష్టపోయింది. ఇలా ప్రారంభం నుంచి సూచీలు భారీ ఊగిసలాట మధ్య పయనిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Enemy: ఓటీటీలో విశాల్‌-ఆర్య ‘ఎనిమి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విశాల్‌. ఆర్యతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎనిమి’. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌  నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా గత నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో విడుదలైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. KTR: హైదరాబాద్ విస్తరణ దృష్ట్యా శివార్లలో మౌలిక వసతులు: కేటీఆర్‌

హైదరాబాద్‌ రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్లు విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రూ.138 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాచుపల్లి- మల్లంపల్లి ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో నగరంలో వారానికి ఒక సారి మంచినీరు వచ్చేవన్న కేటీఆర్.. ఇప్పుడు ప్రతిరోజూ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. CM Jagan: ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.. ఇవ్వనివీ అమలు చేస్తున్నాం: జగన్‌

అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని.. ఇవ్వని హామీలూ అమలు చేసి చూపిస్తున్నామని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని జగన్‌  వర్చువల్‌గా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS News: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్‌ క్లారిటీ

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని ఆయన వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10శాతం మించలేదని డీహెచ్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS High Court: మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరం: హైకోర్టు

10. AP News: నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో ముఠా కారును ట్రాఫిక్‌ ఎస్సై, పోలీసులు గుర్తించి వారిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు వెంబడిస్తుండటంతో కొంతదూరం వెళ్లాక కారును విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని