Top 10 News @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Apr 2021 17:38 IST

1. భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!

ఏప్రిల్‌ 16న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అధర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్యాగ్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ‘‘వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థాలపై అమెరికా విధించిన ఆంక్షలను తొలగిస్తే ఉత్పత్తిని వేగవంతం చేస్తాము. మీ కార్యనిర్వహణ వర్గానికి వివరాలు మొత్తం తెలుసు’’ అని దానిలో పేర్కొన్నారు. కానీ, అమెరికా నుంచి దీనికి సానుకూల స్పందన రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా

2. Hyderabad Metro: వేళల్లో మార్పులు

కరోనా ఉద్ధృతితో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు  హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) ప్రకటన విడుదల చేసింది. నగరంలోని టెర్మినల్‌ మెట్రో స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని.. అవి గమ్యస్థానాలకు  రాత్రి 8.45గంటల్లోపు చేరుకుంటాయని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం ఎప్పటిలాగే 6.30గంటలకు తిరిగి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. COVAXIN తయారీని పెంచుతున్నాం

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ తయారీని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా  ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ తన కొవాగ్జిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 70 కోట్లు డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఈ మేరకు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు?

4. పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి: పవన్‌

ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. కరోనా విజృంభణతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహమ్మారిని అదుపులోకి తేవచ్చు : WHO

వచ్చే కొన్నినెలల్లోనే కరోనా మహమ్మారిని అదుపులోకి తేవడం ప్రపంచ దేశాలకు సాధ్యమని ప్రపంచ ఆరోగ్యసంస్థ అభిప్రాయపడింది. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రపంచ దేశాలు నిష్పక్షపాతంగా వినియోగించుకోవడం ఎంతో అవసరమని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. మహమ్మారిపై ప్రపంచ దేశాలు కలిసిపోరాడాలని పిలుపునిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Hyderabad: పలు ప్రాంతాల్లో వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురిసింది. జీడిమెట్ల, గాజుల రామారం, దుండిగల్‌, కాప్రా, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, ఏఎస్‌ రావు నగర్‌, సైనిక్‌పురి, నేరేడ్‌మెట్‌, పహడీ షరీఫ్‌, జల్‌పల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షపునీరు చేరడంతో ఆయా చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వేసవి తీవ్రతతో అవస్థలు పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్.. చేసే నాలుగు సాదార‌ణ త‌ప్పులు

జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీ ప్రియమైనవారి ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీరు చేయగలిగే ప్రాథమిక పని అని కోవిడ్-19 మ‌హ‌మ్మారి సృష్టించిన సంక్షోభంతో చాలా మంది తెలుసుకున్నారు. జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు ముఖ్య‌ ఉద్దేశ్యం ఒకరి ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటానికి మించినది. కుటుంబంలో ఆదాయం ఉన్న‌వారు ఆకస్మికంగా మరణిస్తే వివాహం, ఉన్నత విద్య లేదా పదవీ విరమణ కోసం పొదుపు వంటి దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇది ఆర్థిక ర‌క్ష‌ణ ఇస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Stock Market: ప్రారంభ లాభాలు ఆవిరి!

8. క్లైమాక్స్ మార్చి ఉంటే ‘బద్రి’ మరోలా ఉండేది!

‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌’.. ‘బద్రి’ అనగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే డైలాగ్‌ ఇది. అంతగా పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌ ఆకట్టుకున్నారు ఈ సినిమాతో మరి. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. 2000 ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ‘బద్రి’. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ ‘రెడ్‌లిస్ట్‌’లో ఉన్నా యథావిధిగా WTC Final 

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC) యథావిధిగా జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించాలని ఇదివరకే ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌లో ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడకు రాకపోకలపై ఇంగ్లాండ్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MS Dhoni: ఎనిమిదేళ్ల నాటి ట్వీట్‌ వైరల్‌

10. కొత్త కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే.. 

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యా అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశం ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. కొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే  దేశ వ్యాప్తంగా 2.59 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 1761మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ 10 రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని