Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2021 09:14 IST

1. ఫార్మెటివ్‌ మార్కులతో ‘పది’లో గ్రేడ్లు

అంతర్గత మార్కుల ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటించనున్నారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి, మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు తుదిదశకు చేరింది. పదో తరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను నిర్వహించారు. ఒక్కో పరీక్షను 50మార్కులకు నిర్వహించారు. ఇప్పటికే ఈ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

161 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల మూత!

2. సృజనకి అన్ని అడ్డంకులా?

తెలుగు సినిమాల్లో యాక్షన్‌ని కొత్త పుంతలు తొక్కించిన   దర్శకుడు వి.వి.వినాయక్‌. ఫ్యాక్షన్‌ కథలతో ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించారు. మాస్‌ నాడి పట్టి స్టార్‌గా ఎదిగిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఈయన ఒకరు. మంచి కథ దొరికిన ప్రతిసారీ దర్శకుడిగా తన సత్తాని చాటుతుంటారు. ప్రస్తుతం ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్న సందర్భంగా వి.వి.వినాయక్‌తో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పొంచి ఉన్న మూడోముప్పు

ప్పటికే రెండు దఫాలుగా జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేసిన కొవిడ్‌ రక్కసి- మూడోసారీ దాడి చేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ‘గతానుభవాల ఆధారంగా’ చేసిన పరిశీలనలు, అధ్యయనాలు మూడోదశ వ్యాప్తి అనివార్యమనే అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. కొవిడ్‌ మూడో దశ తప్పదని, అయితే అది ఎప్పుడు వచ్చేదీ చెప్పలేమని, దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయరాఘవన్‌ సైతం గతంలోనే హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: కరోనా వచ్చింది జంతువుల నుంచే!

4. జకో ఇంకో అడుగే..

అత్యధిక సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన ఫెదరర్‌, నాదల్‌ (20 టైటిళ్లు)లను సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న నొవాక్‌ జకోవిచ్‌ ఆ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. సెమీస్‌లో కెనడా కుర్రాడు షపవ్‌లోవ్‌ను ఓడించిన అతడు ఏడోసారి వింబుల్డన్‌లో ఫైనల్లో ప్రవేశించాడు. ఫైనల్లో అతడు బెరిటినితో తలపడనున్నాడు. నొవాక్‌ జకోవిచ్‌ అదరగొట్టాడు... ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ప్రపంచ నంబర్‌వన్‌ వింబుల్డన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ జకో 7-6 (7/3), 7-5, 7-5తో డెన్నిస్‌ షపవ్‌లోవ్‌ (కెనడా)ను ఓడించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తక్షణమే ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చినందున... వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో కలిపి మొదటి దశలో దాదాపు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సూచించారు. ప్రత్యక్ష పద్ధతి (డైరెక్టు రిక్రూట్‌మెంట్‌)ద్వారా వీటిని భర్తీ చేయాలన్నారు. రెండో దశలో పదోన్నతులు చేపట్టడం ద్వారా ఖాళీ అయ్యే ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా పకడ్బందీగా ఈ ప్రక్రియ సాగాలన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్లు!

6. TS News: దోమలపై మీనాస్త్రం!

నిల్వ నీటిలో గంబూసియా చేపలు వదలడంతో దోమల ఉద్ధృతి తగ్గుతోంది. లార్వా దశలోనే చేపలు తినేయడంతో వాటి పెరుగుదల నిలిచిపోతోంది. మూసీ లాంటి  మురుగు నీటిలో కాకుండా సాధారణంగా నిల్వ ఉండే నీరు, కొద్దిగా మురికిగా ఉండే నీటిలో ఈ చేపలు మనుగడ సాగిస్తాయి. హయత్‌నగర్‌లోని కాప్రాయి చెరువుతో పాటు ఇతర ప్రదేశాల్లో పెంచుతున్న లక్షలాది గంబూసియా చేపలను నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో వదిలేందుకు  రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పథకం ప్రకారమే పాజిటివ్‌ రిపోర్టు

హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ రెండోసారి పోలీసులకు చిక్కాడు. పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించాడని అతనిపై బోయిన్‌పల్లి ఠాణాలో రెండో కేసు నమోదయ్యింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు ఇష్టం లేని అతను.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* China: చైనా హ్యాకర్ల కొత్త ఆట!

8. ఆ ప్రయాణం.. బతుకు గమ్యం చూపింది

ఒకేసారి రెండు దెబ్బలు. ఇంజినీరింగ్‌ పోయింది. సర్వస్వం అనుకున్న అమ్మాయి నా జీవితంలోంచి వెళ్లిపోయింది. బీటెక్‌ నాకర్థం కాలేదు. ప్రేయసి నన్నర్థం చేసుకోలేదు. ప్రేమలో విఫలమైన బాధకంటే, ఇంట్లో ఖాళీగా ఉండటం నరకంలా అనిపించేది. పక్కింటి బాబాయి, ఎదురింటి పిన్ని.. అందరికీ నా జీవితం మీదే శ్రద్ధ. ‘ఏం చేస్తున్నావు?’, ‘ఎప్పుడు సెటిల్‌ అవుతావు?’ ప్రశ్నలతో సూదుల్లా గుచ్చేవారు. ఇక తప్పదని ఇంట్లోంచి బయటికొచ్చేశా. కానీ ఇప్పుడేం చేయాలి? కనీసం చేతిలో డిగ్రీ లేకుండా ఉద్యోగం ఎవరిస్తారు?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. HYD- విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా!

హైదరాబాద్‌-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోడియం పార్కింగ్‌ ఇలా

హుళ అంతస్తుల సముదాయాల్లో పోడియం పార్కింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎకరంపైన స్థలంలో నిర్మించే అపార్ట్‌మెంట్లలో వాహనాలు నిలిపేందుకు మూడు నాలుగు సెల్లార్లు తవ్వే పనిలేకుండా పైనే రెండు మూడు అంతస్తుల్లో పార్కింగ్‌ చేసుకునేలా వెలుసుబాటు ఇచ్చింది. ఈ  మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసింది. పోడియం పార్కింగ్‌ను స్థిరాస్తి సంఘాలు స్వాగతిస్తుండగా.. ఎకరంలోపు కట్టే అపార్ట్‌మెంట్లకు సైతం వర్తింప చేయాలని చిన్న బిల్డర్లు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రాంగణ నియామకాలు.. 40,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని