Updated : 03/08/2021 09:53 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఈ నెలలోనే మూడో ఉద్ధృతి!

భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ ప్రస్తావనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Tokyo Olympics: హాకీ ఇండియా పసిడి ఆశలు ఆవిరి.. సెమీస్‌లో 5-2తో ఓటమి.. ఇక కాంస్య పోరుకు సై

హాకీ ఇండియా సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్లో పరాజయం చవిచూసింది. ప్రపంచ నంబర్‌ వన్‌, కఠిన ప్రత్యర్థి బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓటమి పాలైంది. పసిడి ఆశలు కోల్పోవడంతో ఇక టీమ్‌ఇండియా కాంస్యం కోసం పోరాడనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తుది జట్టులో ఎవరో?

3. Telegram: వెయ్యి మంది వీక్షకులతో గ్రూప్‌ వీడియో కాల్‌

మెసేజింగ్‌ వేదిక ‘టెలిగ్రామ్‌’ సరికొత్త హంగులను జోడించింది. ప్రధానంగా వీడియో కమ్యూనికేషన్‌పై దృష్టి సారించింది. జూన్‌లోనే గ్రూప్‌ వీడియో కాల్స్‌ను ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగస్వాములయ్యేవారి సంఖ్యను తాజాగా వెయ్యి మందికి పెంచింది. దీనివల్ల అంతమంది ఆన్‌లైన్‌ ఉపన్యాసాలను వీక్షించొచ్చని తెలిపింది. చిన్న సంస్థలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయని పేర్కొంది. గరిష్ఠ వీక్షకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతామని వివరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గుండెపోటు నటనే సమస్యగా మారింది

నా చిన్నప్పుడు ఒకతను గుండెపోటుతో చనిపోయారు. అది చూసి నాక్కూడా గుండెపోటు వస్తే ఇలాగే చనిపోతాను కదా అనే భయం పట్టుకుంది. దీంతో ఒత్తిడి కలిగించే విషయం ఏదైనా వింటే బాగా భయపడి, గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ, ఛాతీని బిగపడుతూ ఉండేవాడిని. సమస్యకు పరిష్కారం దొరికితే ఒత్తిడి పోయి, గుండెపోటు తగ్గినట్టుగా భావించుకునేవాడిని. పరిష్కారం దొరక్కపోతే ఛాతీని బిగపట్టటం వదిలేవాడిని కాదు. క్రమంగా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రతి ప్రతికూల ఆలోచనకు భయపడటం, ఛాతీని బిగపట్టటం అలవాటైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మృదులాస్థి మరమ్మతుకు కొత్త హైడ్రోజెల్‌

5. ఆ వివాహానికి అనుమతి ఇవ్వలేం

 తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేరళకు చెందిన ఓ మహిళ చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయమై అంగీకారం తెలపకుండా కేరళ హైకోర్టు సరయిన నిర్ణయమే తీసుకుందని, దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సోమవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కొట్టియూర్‌కు చెందిన ఆ మహిళ బాలికగా ఉన్నప్పుడు రాబిన్‌ వడక్కుంచెరీ అనే క్యాథలిక్‌ క్రైస్తవ మతగురువుతో సంబంధాలు ఉండేవి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యార్థులూ... హాల్‌టికెట్‌ చదివారా?

హైదరాబాద్‌ శివారు హిమాయత్‌సాగర్‌లో పరీక్ష కేంద్రం కాగా.. వారంతా హిమాయత్‌నగర్‌కు చేరుకున్నారు. తీరా హాల్‌టికెట్‌ చూసుకుంటే ఇక్కడ కాదని తేలింది. ముందుగా వచ్చారు కాబట్టి.. వెంటనే సరైన పరీక్ష కేంద్రానికి చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 9న జరిగిన ఎంసెట్‌లో కొందరు విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవమిది... అందుకే విద్యార్థులంతా హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంతం, కేంద్రం పూర్తిపేరును ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా చదువుకోవాలి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఫార్మెటివ్‌ రాత పరీక్షకు 70%వెయిటేజీ

7. పేదరికం వెనక్కి లాగితే... పట్టుదల ఒలింపిక్స్‌కు చేర్చింది!

స్కూల్లో ‘చేతిరాత’ పోటీలు జరుగుతున్నాయి... మొదటి బహుమతి గడియారం... దానికోసం పగలూ, రాత్రీ రాత సాధన చేసి ఫస్ట్‌ప్రైజ్‌ గెల్చుకుందో అమ్మాయి. ‘హమ్మయ్య.. ఇక హాకీ ట్రైనింగ్‌కు లేటవ్వదు. అందులో అలారం ఉంది’ అని సంబరపడిన ఆ పిల్లే ఇప్పుడు టోక్యోలో భారత మహిళల హాకీజట్టు సారథి రాణీరాంపాల్‌.. ఆడపిల్లంటే కడుపులోనే చంపేద్దాం అనే భావన బలంగా ఉన్న ప్రాంతం హరియాణ. అక్కడి కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్‌ గ్రామమే రాణీ సొంతూరు. తండ్రి రిక్షాలాగేవాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Love: చితిపై ఒక్కటైన ప్రేమజంట!

కలకాలం బతకలేని ఓ జంట.. చనిపోయాక జరిగిన వివాహంతో ఒక్కటైంది. తమ ప్రేమను కుటుంబసభ్యులు, సమాజం అంగీకరించదేమోనన్న భయంతో ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే.. అంత్యక్రియల సమయంలో వారిద్దరికీ ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి జరిపించారు. మహారాష్ట్ర జలగావ్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. వాడే గ్రామానికి చెందిన ముకేశ్‌ కైలాస్‌ సోనావోనా(22), పాలట్‌ గ్రామానికి చెందిన నేహా బాపు(19) ప్రేమించుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Illegal affair: కోడలితో వివాహేతర సంబంధం.. ఆమెతో కలిసి కుమారుడిని చంపిన తండ్రి

9. అందరి గురి సంక్రాంతి

ఒక మామూలు సినిమాకి హిట్‌ స్థాయి వసూళ్లు తీసుకు రాగలిగేంత సత్తా సంక్రాంతికి ఉంటుంది. ఇక ‘బాగుంది’ అనే పేరొచ్చిందంటే మాత్రం రికార్డులు నమోదు కావడం ఖాయం. సంక్రాంతి సీజన్‌ అంటే తెలుగు పరిశ్రమకి అంత మక్కువ. ఎన్ని సినిమాలొచ్చినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనేది పరిశ్రమ వర్గాల నమ్మకం. పదిహేను రోజులపాటు సాగే ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు సందడి చేస్తుంటాయంటే కారణం అదే. అయితే అగ్ర తారల సినిమాలు మాత్రం రెండుకి మించి విడుదల కావు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మున్సిపల్‌ సిబ్బందికి ఒంగి నమస్కరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో తాను సమావేశం ఏర్పాటు చేస్తే మూకుమ్మడిగా అంతా గైర్హాజరు కావడంపై తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సిబ్బందితో సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలపడం, అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించడంతో అధికారులకు సందిగ్ధ పరిస్థితి ఎదురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలిసిన వ్యక్తి బైకు ఎక్కిన వితంతువుకు శిరోముండనం

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని