Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jan 2022 09:06 IST

1. T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ విడుదల

టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. అక్టోబర్‌ 23న దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ తొలిపోరు జరగనుంది. నవంబర్‌ 9న తొలి సెమీఫైనల్‌ కాగా, నవంబర్‌ 10న రెండో సెమీస్‌ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సమం చేస్తారా..ఇచ్చేస్తారా!

2. పేదలకు ప్రభుత్వం షాక్‌!

అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న పేదలకు... ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం మరో ఓటీఎస్‌లా మార్చేసింది. 75 చదరపు గజాల వరకే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఒక్క చ.గజం అదనంగా ఉన్నా... మొత్తం స్థలానికి నిర్దేశిత ధర కట్టాల్సిందేనని డిమాండ్‌ నోటీసులు పంపుతోంది. అది నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.లక్షల్లో ఉండటంతో... పేద ప్రజలు ఖంగుతింటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మరోమారు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువల్ని సవరించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్‌లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గర్జించిన గురువులు

పీఆర్సీపై ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ... ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్డెక్కారు. పోలీసులు నోటీసులిచ్చినా, ప్రయాణ సమయంలో ఎక్కడికక్కడ దిగ్బంధించినా, ముళ్ల కంచెలు, బారికేడ్లతో నిలువరించినా... లెక్క చేయకుండా వేలాదిగా కదం తొక్కుతూ గురువారం ఉదయానికే కలెక్టరేట్లకు తరలివచ్చారు. జిల్లాల పాలనా కార్యాలయాలను స్తంభింపజేశారు. మాటతప్పిన, మడమ తిప్పిన సీఎం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రివర్స్‌ పీఆర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటి రుణం.. వాయిదాలు ఆలస్యమైతే..

సొంతిల్లు కొనడమంటే చాలామందికి ఒక పెద్ద కల నెరవేరినట్లే. దీనికి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నన్ని రోజులూ ఇబ్బందులేమీ ఉండవు. ఒకసారి అనుకోని పరిస్థితుల్లో వాయిదాల బకాయి పేరుకుపోయిందా.. ఇక అది పీడకలగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో  రుణగ్రహీతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. ఇప్పుడు అత్యంత తక్కువ వడ్డీకి లభిస్తున్న అప్పుల్లో గృహరుణం ఒకటి. మనకు అనుకూలమైన బ్యాంకు, ఆర్థిక సంస్థ నుంచి ఈ రుణాన్ని తీసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విలాస గృహాలకు తగ్గని గిరాకీ

6. కాల్వలున్నా.. రైల్వే గేట్లున్నా.. దాటి రావాల్సిందే!

రైల్వే గేట్లు, కాల్వలు, జాతీయ రహదారులను దాటి వెళ్లాల్సి ఉన్నా 3, 4, 5 తరగతుల విలీనానికి అడ్డంకి కాదని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక రైల్వేగేట్లు, వంతెనలు ఉన్న కాల్వలు, జాతీయ రహదారులను పిల్లలు వెళ్లేందుకు అవరోధాలుగా పరిగణించొద్దని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వచ్చే ఎన్నికల్లోనూ బైడెన్‌, కమల ద్వయం పోటీ!

అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తాననీ, తనతోపాటు కమలా హారిస్‌ తిరిగి ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటారని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం 79వ పడిలో ఉన్న బైడెన్‌కు 2024 ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయి. ఆయన ఇప్పటికే అమెరికా చరిత్రలో కురు వృద్ధ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. మరి 81 ఏళ్ళ వయసులో దేశాధ్యక్షునిగా బరువుబాధ్యతలను నిర్వహించే శారీరక, మానసిక సత్తా ఆయనకు ఉంటుందా అని సందేహాలు రేగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒంటరిగా లోకమంతా రయ్‌రయ్‌

ఓ మగువ తెగువకు ప్రపంచయానం పాదాక్రాంతమైంది! అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అద్భుత ఘనత ఆమె సొంతమైంది. బెల్జియన్‌-బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌ వయసు 19 ఏళ్లు. బెల్జియంలోని కోర్ట్‌రైలో ఓ చిన్న విమాన స్థావరం నుంచి 155 రోజుల క్రితం తన సాహసయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె.. ఏకంగా 52 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ సురక్షితంగా గురువారం కోర్ట్‌రైకి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మధుమేహ వ్యాధి బాధితులకు ఇన్సులిన్‌ బదులు ‘సెమాగ్లుటైడ్‌’ మాత్ర

బహుళ జాతి ఫార్మా కంపెనీ అయిన నోవో నార్డిస్క్‌, మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం నోటిద్వారా తీసుకునే ‘సెమాగ్లుటైడ్‌’ మాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే మొదటి ‘పెప్టైడ్‌ ఇన్‌ ఏ పిల్‌’ ఇదేనని నోవో నార్డిస్క్‌ వెల్లడించింది. రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోడానికి ఇంజెక్షన్‌ ద్వారా ఇన్సులిన్‌ తీసుకోడానికి వెనకాడుతూ, నోటిద్వారా తీసుకునే మందులకే పరిమితం కావాలనుకునే వారికి ‘సెమాగ్లుటైడ్‌’ వినూత్న పరిష్కారమని ఈ సంస్థ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* క్యాన్సర్‌కు పసుపుతో బయో డ్రగ్‌

10. Tollywood: వారసుల తోడుగా.. తెరపై మెరవగా

చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్‌ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్‌ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే ఇలాంటి అపురూప కలయికల చిత్రాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని