Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jan 2022 09:07 IST

1. AP News:వైకాపావి అసత్య ప్రచారాలు.. ఇవిగో వాస్తవాలు

పీఆర్సీలో జీతభత్యాలు తగ్గడంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని.. రాజకీయ పార్టీలో.. మరొకరో తమను ప్రభావితం చేయలేదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఆందోళనలను పక్కదారి పట్టించేలా వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖ ఉందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: పీఆర్సీపై వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వాదన

2. కొత్త విలువలు ఖరారు

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల కొత్త మార్కెట్‌ విలువల నిర్ధారణ ప్రక్రియను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్‌ విలువలను అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి నేతృత్వంలో ఆ శాఖ సీనియర్‌ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ల్లు నాలుగు రోజులు సుదీర్ఘ కసరత్తు చేసి ఆదివారం కొత్త మార్కెట్‌ విలువల నిర్ధారణ ప్రక్రియను పూర్తిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ ఉద్యోగాలదే జోరు!

కొత్త సంవత్సరంలో ఏయే ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ ఉండబోతోంది? ఎలాంటి కోర్సులు చదివి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే వీటిని సాధించవచ్చు? ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నవారు వీటిని తెలుసుకోవాలనుకుంటారు. ఇలాంటి సందేహాలకు సమాధానం అందిస్తోంది లింక్డ్‌ఇన్‌ సంస్థ నివేదిక. ఈ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం మనదేశానికి సంబంధించి ఉద్యోగ ప్రపంచంలో స్థిరంగా డిమాండ్‌ నిలుపుకుంటున్న కొలువులేమిటో చూద్దామా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Corona Virus: తల్లిదండ్రులే తొలి వైద్యులు

కొవిడ్‌ మహమ్మారి చిన్నారి లేత మనసులను గాయపరుస్తూనే ఉంది. టీనేజ్‌ పిల్లల్లో కుంగుబాటును ఎక్కువ చేస్తోంది. స్నేహితులతో కలిసేందుకు వీల్లేక.. పిల్లలు ‘స్క్రీన్‌ టైమ్‌’కు బానిసలవుతున్నారు. దైనందిన కార్యకలాపాలు దెబ్బతినడంతో పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. పిల్లల ప్రవర్తనల్లో వచ్చిన మార్పులు రెండు వారాలపాటు అలాగే ఉంటే వారిలో మానసిక సమస్య మొదలైనట్లు గుర్తించాలి. ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రాథమిక దశలోనే నియంత్రించాలంటే తల్లిదండ్రులు/ కుటుంబసభ్యులు రోజూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పోరాడినా.. పరాభవమే

లక్ష్యం 288.. ధావన్‌, కోహ్లి అర్ధశతకాలతో ఓ దశలో టీమ్‌ఇండియా స్కోరు 156/3. విరాట్‌ క్రీజులో.. ఇంకా ఏడు వికెట్లు చేతిలో.. ఆ సమయంలో జట్టు గెలుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ మరోసారి మిడిలార్డర్‌ వైఫల్యంతో కీలక వికెట్లు కోల్పోయి 210/6తో ఓటమి దిశగా సాగింది. ఇక పరాజయం ఖాయమనే సమయంలో దీపక్‌ చాహర్‌ అద్భుతంగా పోరాడాడు. సంచలన అర్ధశతకంతో జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. కానీ ఆఖర్లో అతను పెవిలియన్‌ చేరడంతో ఓటమి తప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Tollywood: తెర వారసత్వం

వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది. మెగా కాంపౌండ్‌ నుంచి వైష్ణవ్‌ తేజ్‌, రాజశేఖర్‌ నట వారసురాలిగా శివానీ తెరపై మెరిసి మెప్పించారు. ఇప్పుడు వీరి బాటలోనే ఈ ఏడాదీ పలువురు నట వారసులు వెండితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మెదడుకు మస్కా!

మనసులో అనుకున్నదే తడవుగా.. ఎక్కడో ఉన్న డ్రైవర్‌రహిత కారు మన ముందుకు వచ్చి ఆగితే! మనకు ఇష్టమైన సంగీతాన్ని చెవిలోకి కాకుండా నేరుగా మెదడులోకే చొప్పించేస్తే..! కంప్యూటర్‌ డేటా తరహాలో మన జ్ఞాపకాలనూ డౌన్‌లోడ్‌ చేసుకొని, భద్రపరచుకోగలిగితే..! అవసరమైనప్పుడు వాటిని ‘రీప్లే’ చేసుకోగలిగితే..! వాటిని మరో వ్యక్తిలోకి పంపగలిగితే..! వినడానికి ఇది సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలా అనిపించినా.. ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వ్యాపార దిగ్గజం ఎలన్‌ మస్క్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Indian Independence: కత్తులా.. గాజులా..

స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళల పాత్ర ఆది నుంచీ అమూల్యమైందే! ఈస్టిండియా కంపెనీ హయాంలో రాజు మరణించినా బేలగా మారకుండా... ప్రజల్ని ఆంగ్లేయుల నుంచి కాపాడుకోవటానికి యుద్ధ భూమిలోకి దిగిన వీర రాణులెందరో. ఝాన్సీ లక్ష్మీబాయిలా అనేకమంది బ్రిటిష్‌వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారిలో చరిత్రకెక్కని పేరు రాణి అవంతీబాయి. రామ్‌గఢ్‌ (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోగల దిండోరి పట్టణం) రాజ్యాధినేత విక్రమాదిత్య లోది సతీమణి అవంతీబాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దూసుకెళ్తున్నారు!

‘అమ్మాయిలంటే ఇలానే ఉండాలి..’ తరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ భావనలకి చెక్‌ పెట్టాలనుకున్నారు వీళ్లు. ఇందుకోసం అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకున్న బైక్‌ రేసింగ్‌లో అడుగుపెట్టారు. ఖండాలు, దేశాలు చుట్టేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై చిన్నచూపుని తమదైన శైలిలో దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.. సూరత్‌లో 30 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబంలో పుట్టింది డాక్టర్‌ సారికామెహతా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Selfie: సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు..

రోజూ సెల్ఫీ తీసుకోవడం ఆ విద్యార్థి అలవాటు. ఆ సెల్ఫీలే ఇప్పుడు అతడి జీవితాన్ని మార్చేశాయి. అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు రూ.కోట్లు తెచ్చిపెట్టాయి.సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘొజాలి(22).. ఇండోనేసియాలోని సెమరాంగ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి. కంప్యూటర్‌ ముందు కూర్చుని, రోజూ ఒకటే సెల్ఫీ తీసుకుంటాడు. అలా ఐదేళ్లుగా చేస్తున్నాడు. గ్రాడ్యుయేషన్‌ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలు అన్నింటితో కలిపి ఓ టైమ్‌లాప్స్‌ వీడియో చేద్దామనుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని