Updated : 30/10/2021 21:12 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Puneeth Rajkumar: పునీత్‌కు ఏమైందో చెప్పడం అసాధ్యం: వైద్యులు

కన్నడ ‘పవర్‌స్టార్‌’ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం ఎంతో మందికి తీరని శోకం మిగిల్చింది. ఆయన మరణంతో అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పునీత్‌ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేవారని.. ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ వైద్యుడు రమణరావు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

puneeth rajkumar: పునీత్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌

2. గ్యాస్‌ భారం.. ఎస్‌బీఐ ఊరట.. నవంబర్‌ 1 నుంచి రాబోయే మార్పులివే..

క్యాలెండర్‌లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. సగటు మనిషికి, క్యాలెండర్‌ పేజీకి ఉన్న సంబంధం అలాంటిది. ఒకటో తేదీకి, మనిషి జేబుకు ఆ విధంగా బంధం ముడిపడిపోయింది. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. T20 World Cup: అలాంటి వారే ట్రోల్స్‌ చేసేది: విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద భారత్‌ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఓటమికి కారణమంటూ మహమ్మద్‌ షమీపై నెటిజన్లు అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే టీమ్‌ఇండియా సహా మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు షమీకి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: సూపర్‌.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్‌

4. Politics: సమైక్య వాదంతో ముందుకొస్తే కేసీఆర్‌కు మద్దతిస్తా: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య వాదం వినిపించారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదాన్నే వినిపించా. అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచాను. సమైక్యం.. నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, నా వ్యక్తిగత అభిప్రాయం వేరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. TS News: హుజూరాబాద్‌లో ఫిర్యాదులపై వివరాలు సేకరిస్తున్నాం: శశాంక్‌ గోయల్‌

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీజ్‌ చేస్తున్నాం. కరీంనగర్‌లోని డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. స్ట్రాంగ్ రూమ్‌ వద్ద రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో భద్రత ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్‌.. ఆనంద్‌ దేవరకొండకు భార్య కష్టాలు..!

ఆనంద్‌ దేవరకొండ(Anand Deverakonda)కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’(Pushpaka Vimanam). గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్‌(Allu arjun) విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP News: చెరువులను తలపించే రహదారులు.. గుంతలు పూడ్చి నిరసన తెలిపిన తెదేపా

రహదారులు అధ్వాన్నంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెదేపా నేతలు వినూత్న నిరసన తెలిపారు. సొంత నిధులతో కంకర తీసుకొచ్చి గుంతలు పూడ్చి నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే కృష్ణా జిల్లాలోని నూజివీడు రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం రోడ్డులో గుంతలను స్వయంగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కంకరతో నింపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. T20 World Cup: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాదే విజయం

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ బావుమా (46) రాణించగా.. మార్‌క్రమ్‌ (19) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు ఎక్కువ ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే, డేవిడ్‌ మిల్లర్ (23; 13 బంతుల్లో 2 సిక్స్‌లు), రబాడ (13; 7 బంతుల్లో 1 ఫోర్‌, ఒక సిక్స్‌) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, చమీర రెండు వికెట్లు పడగొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Pakistan: అఫ్గాన్‌ వ్యవహారంలో కీలక పరిణామం.. తాలిబన్‌ దౌత్యవేత్తలకు పాక్‌ అనుమతి

అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మొదటి నుంచి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకున్నా.. మరోవైపు పాక్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం, ఆయా కాన్సులేట్‌లలో విధులు చేపట్టేందుకు తాలిబన్లు నియమించిన దౌత్యవేత్తలను అనుమతించినట్లు సమాచారం. ఈ మేరకు వారికి వీసాలూ జారీ చేసింది. సర్దార్ మహమ్మద్ షోకైబ్ ఇస్లామాబాద్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయంలో ఫస్ట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Rahul Gandhi: గోవా వీధుల్లో రాహుల్‌ బైక్‌ రైడ్‌.. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేశారు. ఈ ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్‌.. అక్కడి బాంబూలిమ్‌ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన ఆయన మధ్యలో ఆగి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఆ తర్వాత గోవాలో ‘పైలట్‌’గా పిలిచే టూవీలర్‌ ట్యాక్సీ బండిపై లిఫ్ట్‌ అడిగి ఆజాద్‌ మైదాన్‌ వరకు వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని