AP News: కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలు ప్రాసెస్‌ చేయలేం: ట్రెజరీ ఉద్యోగుల సంఘం

ఏపీలో కొత్త పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతమవుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్‌ చేయాలని డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Published : 20 Jan 2022 18:09 IST

అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతమవుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్‌ చేయాలని డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే, సవరించిన వేతన బిల్లులను ప్రాసెస్‌ చేయబోమని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. తమ జీతాల వరకైనా ప్రాసెస్‌ చేసుకోవాలని అధికారులు ట్రెజరీ ఉద్యోగులకు సూచిస్తుండగా.. అందుకు వారు నిరాకరిస్తున్నారు. తమపై ఒత్తిడి తేవద్దని కోరుతున్నారు. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈమేరకు ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని