‘విద్యుత్‌ బకాయిలపై త్వరలో విధాన నిర్ణయం’

గ్రామ పంచాయతీలు, పురపాలికలు ప్రతి నెలా విధిగా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. బిల్లులు చెల్లించకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల చెల్లింపులపై డిస్కం, పురపాలిక, పంచాయతీ రాజ్‌

Published : 01 Aug 2020 01:54 IST

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలు, పురపాలికలు ప్రతి నెలా విధిగా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. బిల్లులు చెల్లించకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల చెల్లింపులపై డిస్కం, పురపాలిక, పంచాయతీ రాజ్‌ అధికారులతో సీఎస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ‘‘విద్యుత్‌ బకాయిల చెల్లింపులపై సీఎం త్వరలో విధాన నిర్ణయం తీసుకుంటారు. బకాయిలపై వారం రోజుల్లో డిస్కంలు సమగ్ర నివేదిక రూపొందించాలి. పని చేయని బోర్లు, విద్యుత్‌ బిల్లుల తేడాపై ఉమ్మడి బృందాలు ఏర్పాటు చేస్తాం. పూర్తిగా మీటర్ల రీడింగ్‌ ద్వారానే బిల్లులు వసూలు చేయాలి. మీటర్లు లేని చోట్ల నెల రోజుల్లో ఏర్పాటు చేయాలి’’అని సోమేశ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు