Saidabad: రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించిన హైకోర్టు

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌

Updated : 07 Dec 2022 14:08 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లైంగికదాడి, హత్యకేసు నిందితుడు రాజు మృతిపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దాఖలు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, మృతదేహం పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని అడ్వొకేట్‌ జనరల్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ చిత్రీకరణ జరిగిందని వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది. వీడియోలు రేపు రాత్రి 8గంటలకల్లా అందజేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని